ప్రముఖ సినీ నటి జయంతి గారు ఇటీవల చివరి శ్వాస విడిచారు. జయంతి గారు కర్ణాటకలోని బళ్లారి కి చెందిన వారు. 1960 లో ఒక తమిళ సినిమాతో బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. జయంతి గారి అసలు పేరు కమలకుమారి. కన్నడ దర్శకుడు వై ఆర్ స్వామి జయంతి గారి పేరుని మార్చారు. జయంతి గారు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించారు.

Jayanthi and Savitri shocking incident

తెలుగులో బొబ్బిలి యుద్ధం, కులగౌరవం, పెదరాయుడు, కొండవీటి సింహం, జగదేకవీరుని కథ, జస్టిస్ చౌదరి వంటి సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ నటిగా ఉత్తమ, సహాయ నటిగా ప్రెసిడెంట్ మెడల్, అలాగే రెండు ఫిలిం ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు జయంతి గారు. కర్ణాటక ప్రభుత్వం అభినయ శారద అనే బిరుదుతో జయంతి గారిని సత్కరించింది.actress jayanthi and prashanth relation

అయితే జయంతి గారి మనవడు కూడా సినిమాల్లోనే ఉన్నారు. తమిళ్ లో పెద్ద హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన మరెవరో కాదు. హీరో ప్రశాంత్. జీన్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులైన ప్రశాంత్, జయంతి గారికి మనవడి వరస అవుతారు. అది ఎలాగంటే జయంతి గారి భర్త పేరు పేకేటి శివరాం.

actress jayanthi and prashanth relation

actress jayanthi husband peketi sivaram

పేకేటి శివరాం గారికి జయంతి గారు రెండవ భార్య. శివరాం గారి మొదటి భార్య పేరు గీత. శివరాం గారికి, గీత గారికి గీత గారికి పుట్టిన శాంతిని, ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ గారు పెళ్లి చేసుకున్నారు. అలా శివరాం గారు ప్రశాంత్ తండ్రి గారికి త్యాగరాజన్ మామయ్య అవుతారు. ప్రశాంత్ కి పెకేటి శివరాం గారు తాత అవుతారు. అలా ప్రశాంత్, జయంతి గారికి మనవడి వరస అవుతారు.