ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు పద్మ జయంతి గారు. పద్మ జయంతి గారు ఇప్పటి వరకు దాదాపు 350 సినిమాల్లో నటించారు. పద్మ జయంతి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఒక కమెడియన్ తో తనకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు.

actress padma jayanthi about ms narayana

పద్మ జయంతి గారు మాట్లాడుతూ, “ఒక షూటింగ్ అవుతోంది. ఒక మూవీకి వర్క్ చేస్తున్నాను నేను. అప్పటికి మా అత్తగారు పోయి వన్ మంత్ అయింది. ఆ రోజున నెల కార్యం చేస్తున్నారు. నేను మిస్ అయ్యాను. నేను లేకపోవడం వల్ల మా ఆయనని అందరూ ఏవో మాటలు అన్నారు. దగ్గర దగ్గర ఒక ఇరవై రెండు మంది ఆర్టిస్టులకు కాంబినేషన్ సీన్ అది. ఆ సిట్యువేషన్ లో నాకు బయటికి వెళ్లడానికి లేదు.

actress padma jayanthi about ms narayana

అదే మూమెంట్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. లంచ్ కూడా చేయలేదు. నేను కూర్చుని ఉండగా గబుక్కున ఏదో ఒక పర్సనాలిటీ అలా వచ్చినట్టు అనిపించింది. వచ్చి గబుక్కున నా చేయి పట్టుకుని లాక్కుని వెళ్తున్నారు. ఎవరబ్బా? ఏంటి? అని నేను చూశాను. చూస్తే ది గ్రేట్ ఎమ్మెస్ గారు. నేను కూర్చున్నా ఆయన నుంచున్నా ఒకటే హైట్. దాంతో చేయి పట్టుకొని లాక్కుని వెళ్తున్నారు. “ఏంటి సార్?” అని అడిగాను. “ఏం లేదు నీతో మాట్లాడే పని ఉంది?” అని అన్నారు.

actress padma jayanthi about ms narayana

“ఏంటి సార్?” అన్నాను. అప్పటికే వాసన వస్తోంది. సెట్ లో ఆయన ఫుల్ లోడ్ లో ఉన్నారు. పట్టుకొని లాక్కెళ్తూ ఉన్నారు. లాక్కుని వెళ్తూ ఉంటే “ఏంటి?” అంటే “ఎహే రావే” అని అన్నారు. ఒక్కసారి చేయి విదిలిచ్చేసుకున్నాను. “ఏంటి సార్?” అని అడిగితే, ఆయన కమెడియన్ కదా “చాలా బాగున్నావ్, హోమ్లీ గా ఉన్నావ్” అని అన్నారు. నాకు సిట్యువేషన్ అర్థమైపోయింది.

ఒక్కసారిగా చేయి విదిలించుకుని “ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు? లొకేషన్ లో ఉన్నారు. ఏంటి సంగతి? షూటింగ్ చేయడానికి రాలేదా ఏంటి?” అని అడిగాను.  “షూటింగ్ చేసే మూడే లేదు నాకు” అని అన్నారు. “సరే మూడ్ లేకపోతే ఇంటికి వెళ్లిపోండి. మూడ్ వచ్చేస్తుంది” అని అన్నాను. “కాదు కాదు” అని చెప్పి మొత్తానికి మా ఇద్దరి మధ్య చాలా కాంట్రోవర్సీ అయిపోయింది.

actress padma jayanthi about ms narayana

ఆయన కొంచెం రఫ్ హ్యాండిలింగ్ చేయబోతున్నారు. ఎంత సేపు సరదాగా తీసుకోవాలో అంత సేపు సరదాగా తీసుకుంటాం. అప్పటికీ నా మూడ్ లో నేను ఉన్నా కూడా ఆయన ఏదో కామెడీ చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఆయన సీరియస్ సిట్యువేషన్ లో ఉన్నారు. ఇది ఇమిడియట్ గా కట్ చేయకపోతే బాగుండదు అనుకొని సీరియస్ గా చెప్పాను. అది కాదు అని చెప్పే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. తీసుకెళ్లి పీక పట్టుకొని గోడ దగ్గరికి లాక్కొని వెళ్ళిపోయి నుంచోపెట్టేసాను.

actress padma jayanthi about ms narayana

ఆయన గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. అందరూ వచ్చి ఆయనని విడిపించి తీసుకొని వెళ్ళిపోయారు. అందరూ నన్ను కూల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నాకు సర్దిచెప్పడానికి ట్రై చేశారు. తర్వాత మళ్లీ చాలా పెద్ద సిట్యువేషన్ అయ్యింది. నేను కంప్లైంట్ చేయడం. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి కూర్చోవడం. మాట్లాడడం. సాయంత్రం అయ్యేటప్పటికీ పెద్ద వాళ్ళు అందరూ గ్యాదర్ అయిపోయి ఫోన్ చేసి “నువ్వు పోక పోక ఒక పెద్ద కొండని ఢీ కొడుతున్నావు. రేపొద్దున నీకు లైఫే ఉండదు జాగ్రత్త” అని అన్నారు.

actress padma jayanthi about ms narayana

కానీ నేను వెనక్కి తగ్గలేదు. కానీ నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. అదేంటంటే, మనకంటూ ఒక సపోర్ట్ కావాలి. మనకు సపోర్ట్ లేకపోతే ఎలాంటి వాళ్ళు అయినా అడ్వాంటేజ్ తీసుకుంటారు. లేదా మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. దాని గురించి కూడా ఫైట్ చేశాను. చాలా రోజులు బెదిరింపులు వచ్చాయి. దగ్గర దగ్గర నాకు ఒక అరడజన్, డజన్ సినిమాలు పోయాయి.

actress padma jayanthi about ms narayana

నేను ఫలానా సినిమా చేస్తున్నాను అంటే నాకు ఫోన్ చేసి నీకు లైఫ్ లేకుండా చేస్తామని బెదిరించే వాళ్లు. ప్రొడ్యూసర్ గారికి చెప్పి నా క్యారెక్టర్ తీయించేసేవాళ్ళు. ఇప్పుడు ఒక కొత్త వార్త వచ్చింది అంటే పాత వార్త వెనక్కి పడిపోతుంది. నాది కూడా అలాగే అయ్యి నాకు మళ్ళీ నా పని నేను చేసుకోవడం మొదలైంది.” అని అన్నారు.

actress padma jayanthi about ms narayana

watch video : 


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE