బాలకృష్ణ గారి ఆ మాటతో నా భయమంతా పోయింది.

బాలకృష్ణ గారి ఆ మాటతో నా భయమంతా పోయింది.

by Megha Varna

సీనియర్ హీరోయిన్ రాశి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నందమూరి బాలకృష్ణ గురించి వచ్చిన సందర్భంలో పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకొంది.ఆయనతో కృష్ణబాబు సినిమా చేస్తున్న సమయంలో ఎం జరిగిందో తెలిసింది .

Video Advertisement

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డామ్ అందుకున్న ప్రముఖ హీరోయిన్స్ లో రాశి ఒకరు.మద్రాస్ లో ఒకొనొక సమయంలో టాలీవుడ్ లో అగ్ర కదనాయకుల్లో ఒకరు రాశి.అప్పట్లో హీరోయిన్ రాశి కంటూ ప్రత్యేకమైన అభిమాన బృందం ఉండేవారు.దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించారు రాశి.టాలీవుడ్ లో 25 చిత్రాలకు పైగా హీరోయిన్ గా నటించారు రాశి.రాశి హీరోయిన్ గా పరిచయం అవ్వకముందు చిన్ననాటి నుండి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఈ నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరో బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.వివరాల్లోకి వెళ్తే ..

 

బాలకృష్ణ గారితో బాల గోపాలుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను.ఆ సమయంలో బాలకృష్ణ గారు నాతో బాగా మాట్లాడేవారు.అప్పట్లో నేను బాలకృష్ణ గారి బర్త్ డే పార్టీలకు కూడా వెళ్లేదాన్ని.ఆ తర్వాత నేను హీరోయిన్ అయ్యాక బాలయ్య బాబుగారితో కృష్ణబాబు చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.ఎప్పుడో బాలగోపాళం సినిమాలో కలిసాం ఇప్పుడు ఎలా మాట్లాడతారో అని లోపల కొంచెం భయం నెలకొంది అని తెలిపారు రాశి.

కానీ కృష్ణబాబు సినిమా మొదటి రోజు షూటింగ్ కి వెళ్ళేటప్పటికి ఎంట్రన్స్ లో బాలయ్య బాబు గారు కూర్చొని ఉన్నారు .నేను పలకరించగా ముందే ఎలా ఉన్నావ్ ఏంచేస్తున్నావ్ అని బాగా పలకరించారు బాలయ్య బాబు గారు అని రాశి తెలిపారు .తర్వాత షూటింగ్ అంతా కూడా చాలా కూల్ గా సాగింది అని రాశి తెలిపారు.పెళ్లి అయినా తర్వాతా సినిమాలకు దూరం అయినా రాశి తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం ఈమధ్యనే మళ్ళీ తిరిగి ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది .


You may also like

Leave a Comment