ప్రియున్ని వివాహం చేసుకున్న నటి రష్మీ.!

ప్రియున్ని వివాహం చేసుకున్న నటి రష్మీ.!

by Sunku Sravan

Ads

తెలుగు ప్రేక్షకులకు కావ్యాంజలి టెలివిజన్ సీరియల్స్ తో ఎంతోమందిని ఆకట్టుకుంటున్న రష్మీ ప్రభాకర్ తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నది. వివాహం జరిగిన తర్వాత దిగిన ఫోటోలతో తన పెళ్లి వార్తను అభిమానులకు తెలియజేసింది. గత కొంత కాలంగా రష్మీ ప్రభాకర్ నిఖిల్ భార్గవ్ ఎఫైర్ ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారి కుటుంబాలు అంగీకరించడంతో వివాహానికి మార్గం సులువైంది. గత సంవత్సరం నవంబర్ లో తన నిశ్చితార్థం జరిగింది.

Video Advertisement

ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. అలాగే ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ తన ప్రేమ కథను అభిమానులతో పంచుకున్నది. నిఖిల్ భార్గవ్ తో ఏవిధంగా ప్రేమలో పడింది తన జీవితంలో తన నిఖిల్ మిస్టర్ పర్ఫెక్ట్ అని తెలిసిన తర్వాత ప్రపోజల్ లవ్ నుంచి పెళ్లి వరకు తన జీవితం కొనసాగిందని విషయాలను చెప్పింది. నిశ్చితార్థం తర్వాత రష్మీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ నిఖిల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పని చేస్తాడు.

3 సంవత్సరాల క్రితం ఒక ఈవెంట్ లో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తే ఒక కామన్ స్నేహితుని ద్వారా నిఖిల్ ని కలిసాను. దీంతో మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మా అభిరుచులు అన్నీ కలిశాయి. తర్వాత రోజు నిఖిల్ నాకు ప్రపోజ్ చేశారు అని రష్మీ తెలియజేసింది. ఆయన ప్రపోస్ తర్వాత చాలా ఆలోచించాను. లాక్ డౌన్ సమయంలో ఇద్దరం కలిసి చాలా మంది పేదలకు ఆహార పదార్ధాలు ఇవ్వడం వంటి బాధ్యతలను తీసుకున్నాం.

మా ఇద్దరి గురించి మా కుటుంబాల్లో తెలిసింది. దీంతో నిఖిల్ ప్రపోజ్ ను అంగీకరించాను. తర్వాత మా రిలేషన్ గురించి మా తల్లిదండ్రులకు చెప్పాను. వాళ్లు కూడా సరే అన్నారు. నిఖిల్ నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. వివాహం తర్వాత కూడా నేను నటించడానికి ఆయనకు అభ్యంతరం ఏమీ లేదు.

నన్ను అలాగే కొనసాగాలని ప్రోత్సహిస్తున్నాడు. అందుకే అతన్ని నమ్మాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్ 25వ తేదీన రష్మీ నిఖిల్ వివాహం బెంగళూరులో జరిగింది. ఈ పెళ్లికి కోవిద్ కారణాలవల్ల ఎక్కువ మందిని ఆహ్వానించలేదని తెలియజేసింది. దీంతో తన పెళ్లి ఫోటోలను సెల్ఫీ లతో దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.


End of Article

You may also like