రాజమౌళి ఛాన్స్ ఇచ్చినా కూడా…ఒకప్పటి హీరోయిన్ “రితిక” అందుకే కెరీర్ లో రానించలేకపోయారా?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చినా కూడా…ఒకప్పటి హీరోయిన్ “రితిక” అందుకే కెరీర్ లో రానించలేకపోయారా?

by Sunku Sravan

Ads

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక మాయా ప్రపంచం. ఇందులో రాణించాలంటే టాలెంట్ తో పాటుగా కాస్త లక్ కూడా ఉండాలి. ఇండస్ట్రీలో ఒకేసారి ఒక వెలుగు వెలిగి తర్వాత కనిపించకుండా పోయిన చాలామంది నటీనటులు ఉన్నారు.

Video Advertisement

అందులో ఒక కథానాయిక గురించి మనం ఇప్పుడు చూద్దాం..? సిక్స్ టీన్స్ అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రుతిక ..

సరదా సరదాగా, విక్రమార్కుడు, గర్ల్ ఫ్రెండ్, బ్లేడ్ బాబ్జి, జాన్ అప్పారావు 40 ప్లస్, ప్రేమాభిషేకం వంటి సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా మరింత పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడింది. గ్లామర్ షో చేయడానికి కాని కొంచెం కూడా వెనకాడలేదని చెప్పవచ్చు. అందం అభినయం ఉన్న కానీ ఈమెకు అదృష్టం మాత్రం కలిసి రాలేదని తెలుస్తోంది.

ఇండస్ట్రీ లో టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి. కానీ రుతిక కు అది లేదని చెప్పవచ్చు. జక్కన్న కూడా ఈమెను నిలబెట్టలేకపోయారు అంటే ఈమె బ్యాడ్ టైం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈమె తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ్, కన్నడ ఇండస్ట్రీ లో కూడా నటించింది అక్కడ కూడా క్లిక్ కాలేదు. ఐటెం సాంగ్, స్పెషల్ సాంగ్స్ కూడా చేయడానికి వెనుకంజ వేయలేదు.

ఇండస్ట్రీలోకి మొదట్లో వచ్చినప్పుడు ఈమె చేసిన బి గ్రేడ్ సినిమాలు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు విడుదలయ్యాయి. ” సారీ మా ఆయన ఇంట్లో ఉన్నాడు, సారీ నాకు పెళ్లైంది, వంటి మూవీస్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా లేటుగా విడుదలయ్యాయి. దీని వల్లే ఆమె కెరీర్ దెబ్బతిని ఉండొచ్చని, ఆమె ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. హీరోయిన్ గా రాణించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కాని కలిసి రాలేదు. దీంతో సినిమాలకు దూరం అయింది.


End of Article

You may also like