బాల నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన షామిలీ ఎన్నో చిత్రాలలో నటించింది. బాలనటిగా ఆమె జాతీయ అవార్డును కూడా అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాలలో నటించింది.

Video Advertisement

షామిలీ హీరోయిన్ గా ‘ఓయ్’ చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన నటనతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. చాలా కాలం తరువాత నాగశౌర్యతో కలిసి ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రంలో నటించారు. అప్పటి నుండి  టాలీవుడ్ లో ఇంకే సినిమా చేయలేదు.
ఓయ్, అమ్మమ్మగారిల్లు సినిమాల తరువాత షామిలీ మళ్ళీ  టాలీవుడ్ లో కనిపించలేదు. ఆమె ప్రస్తుతం ఏం చేస్తోంది? ఆమె లక్ష్యం ఏమిటి? మళ్లీ సినిమాలలో నటిస్తుందా లాంటి  ప్రశ్నలకు తాజాగా ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం షామిలీ నాట్య కళలు, చిత్రలేఖనం పై ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా  చెప్పుకొచ్చారు. ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ‘‘నేను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో సుమారు యాబైకి పైగా సినిమాలలో నటించాను.
కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా కూడా నటించాను. అయితే నాకు చిత్రలేఖనం పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ రంగంలో  దృష్టి పెట్టానని, నా టాలెంట్ ను నిరూపించుకుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా. అమెరికాకు వెళ్ళి చిత్రలేఖనం లో ట్రైనింగ్ తీసుకున్నాను. చెన్నై, బెంగుళూరులలో జరిగిన పెయింటింగ్‌ కి సంబంధించిన ఎగ్జిబిషన్లలో నేను వేసిన పెయింటింగ్స్‌ను ప్రదర్శించాను. త్వరలో సొంతంగా ఒక పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ చెన్నైలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. సినిమాల్లో మళ్ళీ నటించే విషయం పై ఆలోచించలేదు. నా లక్ష్యం పెయింటింగ్ ఎగ్జిబిషన్. అది పూర్తయితే మళ్లీ నటిస్తానో లేదో ఇప్పుడే ఏం  చెప్పలేను. నేను ప్రస్తుతం ఏ మూవీకి సైన్ చేయలేదు” అని షామిలీ తెలిపింది. ఇక  ఆమెకు పెయింటింగ్ అంటే ఎంత ఆసక్తో షామిలీ ఇన్‌స్టాగ్రమ్‌ ఫాలోవర్స్ కి  బాగా తెలుసు. ఆమె పెట్టె పెయింటింగ్ పోస్ట్‌లకు కామెంట్స్ వస్తుంటాయి. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ పైనే మీదనే ఉంది.

Also Read: KISI KA BHAI KISI KI JAAN REVIEW : “సల్మాన్ ఖాన్” హీరోగా నటించిన మరొక రీమేక్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!