శ్రీదేవి తన కూతురుకి “జాన్వీ” అని పేరు పెట్టడం వెనక ఆ హీరోయిన్ ఉందా.?

శ్రీదేవి తన కూతురుకి “జాన్వీ” అని పేరు పెట్టడం వెనక ఆ హీరోయిన్ ఉందా.?

by Sunku Sravan

Ads

ఒకప్పుడు తన అందంతో అభినయంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి. ఆమె కెరీర్లో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా మారాయి. తర్వాత తన కూతురు జాన్వి కూడా ఆమె బాటలో నడుస్తుంది. ఎన్నో సినిమాల్లో నటిస్తూ మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటోంది. అయితే జాన్వి కపూర్ కు శ్రీదేవి ఆ పేరు పెట్టడం వెనుక ఒక కారణం ఉందట అది ఏంటో చూద్దాం..!

Video Advertisement

ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో తన పేరు గురించి మాట్లాడిన జాన్వీకపూర్ జుదాయి మూవీ లో ఊర్మిళ పాత్రకు కూడా ఇదే పేరు ఉండటాన్ని మరోసారి గుర్తు చేసింది. అయితే తనకు జాన్వి పేరు జుదాయి మూవీ వల్ల పెట్టలేదు అని క్లారిటీ ఇచ్చేసింది.

తల్లిదండ్రులైన శ్రీదేవి మరియు బోనీకపూర్ లకు జానకి అనే పేరు చాలా ఇష్టమని చేప్పింది. జుదాయి సినిమా వచ్చిన దానికంటే ముందే మా డాడీకి జాన్వి అనే పేరు అంటే ఇష్టం అన్నది. దివంగత శ్రీదేవి గారికయితే జాన్వి అనే పేరు ఇష్టమే కాకుండా ఒక ప్రత్యేకం అని తెలియజేసింది. జాన్వి అంటే అర్థం స్వచ్ఛత,పవిత్రత అని అన్నది.

దీంతో బోనీ, శ్రీదేవి ఇద్దరూ కలిసి ఆ పేరును ఫైనల్ చేశారని అంటోంది ఈ అమ్మడు. జుదాయి మూవీని బోనీకపూర్ నిర్మించగా ఇందులో అనిల్ కపూర్ హీరోగా నటించారు. ఇందులో ఊర్మిళ జాన్వి పాత్రలో కనిపించింది. 1997 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జుదాయి సినిమా విడుదలైంది. విడుదల తర్వాత వారం లోపే మార్చి 6, 1997లో జాన్వీ కపూర్ జన్మించింది.


End of Article

You may also like