Ads
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావ్యం ‘సీతా రామం’. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మాణ సారధ్యంలో ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది.
Video Advertisement
ఈ సెన్సిటివ్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి మంచి ఆదరణ లభించింది. సోషల్ మీడియాలో కూడా సినిమా నచ్చిన వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు. సినిమాకు లాభాలు కూడా భారీగానే వచ్చాయి.
సినిమా కథ బాగుండటం ఒకటి అయితే సీతకు, రామ్ కు మధ్య జరిగిన సంభాషణలు సినిమాకు మరింత ప్లస్ అయింది. వారిద్దరి మధ్య జరిగిన ఉత్తరాల సంభాషణలు సినిమాను మరో రేంజ్ కు తీసుకువెళ్ళాయి.
ఈ సినిమాలో హీరోయిన్ అందం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. తెరపై ఆమె ప్లేస్సెంట్ లుక్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అంతే కాకుండా మరో అమ్మాయి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె హీరోయిన్ స్నేహితురాలు రేఖ. ఆ నటి పేరు రుక్మిణి విజయ్ కుమార్. ఈమెది హైదరాబాద్. ఈమె భరత నాట్యాకారిణి. ఈమె నటనతో పాటు డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా చేస్తున్నారు.
‘ఆనంద తాండవం’ చిత్రం తో తెరపై కనిపించిన ఆమె ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ సీతారామం చిత్రం ద్వారా ఆమెకు గుర్తింపు లభించింది. ఆనందతాండవం అనే సినిమాలో రొమాంటిక్ పాత్ర చేసి ఆకట్టుకుంది రుక్మిణి విజయ్ కుమార్. తర్వాత సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం లో రజనీకాంత్ హీరోగా, దీపికా పదుకొనె హీరోయిన్ గా వచ్చిన కొచ్చాడియాన్ సినిమాలో రుక్మిణి రజని కాంత్ కి చెల్లెలు గా నటించింది. తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ సరసన హీరోయిన్ గా చేసింది.
అంతే కాకుండా అనేక డాన్స్ ఆల్బమ్స్ కొరియోగ్రఫీ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఈమె. సోషల్ మీడియా వేదికగా డాన్స్ నేర్చుకోవాలనుకునే వారికి ఆమె సింపుల్ చిట్కాలు చెప్తూ ఆమె బాగా పాపులర్ అయ్యారు.
End of Article