ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తప్ప మిగిలిన అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

actress who acted as rashmika friend in pushpa

ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ మాత్రమే కాకుండా సహాయ నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. వారిలో హీరోయిన్ ఫ్రెండ్స్ గా నటించిన ఈ అమ్మాయి కూడా ఒకరు. ఈ పాత్ర, హీరోయిన్ సీన్స్ ఉన్న ప్రతిసారీ కనిపిస్తూ ఉంటుంది. ఈ పాత్రలో నటించిన నటి పేరు అనష్వి. అనష్వికి ఇది మొదటి సినిమా. కానీ తెరపై కనిపించడం మాత్రం ఇది మొదటిసారి కాదు. అంటే, అంతకు ముందు కూడా అనష్వి ఒక టీవీ ప్రోగ్రాంలో కనిపించారు. జీ తెలుగులో ప్రసారం అయిన స్పెషల్ ఈవెంట్ లో ఆర్టిస్ట్ సద్దాంతో కలిసి వచ్చారు అనష్వి. ఆ వీడియో అంతకుముందు చాలా పాపులర్ అయ్యింది.

actress who acted as rashmika friend in pushpa

image source : Instagram (anashvi_k)

అనష్వి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అలా పరిచయం అయిన అనష్వి, పుష్ప సినిమా ద్వారా ఇంకా పాపులర్ అయ్యారు. అలాగే పుష్ప సెకండ్ పార్ట్ అయిన పుష్ప – ద రూల్ లో కూడా అనష్వి కనిపిస్తారు. ప్రస్తుతం సినిమా బృందం అంతా సెకండ్ పార్ట్ కి సంబంధించిన చర్చల్లో ఉన్నారు. సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభం అవుతున్నట్టు సమాచారం. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంలో చాలా ట్విస్ట్ లు ఉంటాయి అని, కథాపరంగా కూడా చాలా బలంగా ఉంటుంది అని సుకుమార్ ఇటీవల చెప్పారు.

watch video :