సోషల్ మీడియా అనేది కొన్ని విలువైన విషయాలను చెప్పడానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుంది. కానీ కొన్ని సార్లు మాత్రం అనవసరమైన విషయాలకి సెలబ్రిటీలని పాయింట్ చేసి ట్రెండ్ చేయడానికి ఒక మాధ్యమం కూడా అవుతోంది. అలా కొంత మంది సినీ ప్రముఖులు ఇటీవల సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రెండ్ అయ్యారు. వాళ్ళు ఎవరో, వాళ్ళు అలా ట్రెండ్ అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

#1. ఆలియా భట్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత 8 సంవత్సరాల క్రితం కాఫీ విత్ కరణ్ షోలో అలియా భట్ అన్న ఒక మాట వైరల్ అయ్యింది. ఈ క్లిప్ తర్వాత ఆలియా భట్ నటించిన సడక్ 2 సినిమాపై కూడా ప్రభావం చూపింది.

#2. సమంత అక్కినేని

తమిళం మనోభావాలు దెబ్బ తీసేలా సమంత పాత్ర ఉంది అంటూ సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 పై గొడవ అయ్యింది. అలాగే మహేష్ బాబు నటించిన “1 నేనొక్కడినే” సినిమా పోస్టర్ గురించి కూడా ఒక ట్వీట్ పోస్ట్ చేసి ట్రోల్ల్స్ కి గురయ్యారు సమంత.

Remuneration of the family man season 2 actors

#3. రాధిక ఆప్టే

రాజ్ కుంద్రా వివాదంలో స్పందించలేదు అంటూ రాధిక ఆప్టే పై ట్రెండ్ మొదలుపెట్టారు.

Radhika Apte about her viral video

#4. కరీనా కపూర్

కరీనా కపూర్ ఒక ముస్లిం ని పెళ్లి చేసుకున్నారు అని, తను సీత పాత్ర పోషించకూడదు అని సోషల్ మీడియాలో “బాయ్ కాట్ కరీనా కపూర్” అని ట్రెండ్ చేశారు.

#5. రియా చక్రవర్తి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలో రియా చక్రవర్తి హస్తం ఉంది అని సోషల్ మీడియాలో చాలా కాలం నుండి ట్రెండ్ అవుతున్నారు.

rhea chakraborthy

#6. స్వర భాస్కర్

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కూడా జె ఎన్ యు విషయంపై మాట్లాడడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.

#7. పూజా హెగ్డే

సౌత్ ఇండియన్స్ కి నడుము ఫాంటసీ ఉంది అని ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే తెలపడంతో, సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ గా కామెంట్ చేశారు. తర్వాత పూజ హెగ్డే ఆ స్టేట్మెంట్ కి వివరణ ఇచ్చారు.

#8. సోనమ్ కపూర్

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా కాఫీ విత్ కరణ్ షోలో “సుశాంత్ అంటే ఎవరు?” అని అడిగినందుకు, సుశాంత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో సోనమ్ పై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

#9. పార్వతి తిరువోతు

మమ్ముట్టి గారు హీరోగా నటించిన ఒక మలయాళం సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పడంతో, మలయాళ నటి పార్వతి తిరువోతు పై మమ్ముట్టి అభిమానులు సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేశారు.

#10. తాప్సి

హీరోయిన్ల బొడ్డు పై పండ్లు వేస్తారు అంటూ సౌత్ సినిమాల గురించి చెప్తూ ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్ర రావు గారిపై కామెంట్స్ చేసినందుకు నెటిజెన్స్ తాప్సిపై ఫైర్ అయ్యారు.

#11. అనుపమ పరమేశ్వరన్

“వకీల్ సాబ్” గురించి ట్వీట్ లో “పవన్ కళ్యాణ్” గారిని సార్ అనలేదు అని అనుపమ పై ట్రోల్ల్స్ చేసారు ఫ్యాన్స్. తర్వాత సారీ అని చెప్పారు అనుపమ.

వీరే కాకుండా ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు వింత కారణాలపై సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రెండ్ అయ్యారు.