హీరోయిన్లకి రాను రాను అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఒకప్పుడు వచ్చినన్ని అవకాశాలు ఆ తర్వాత రావు. చాలా మంది అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఎదిగారు వారిలో యమునా కూడా ఒకరు. ఆ తర్వాత ఆమె సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు ఎప్పుడూ కూడా తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకునే వారు యమున. 2011లో ఆమె మీద కొన్ని వార్తలు వచ్చాయి.

Video Advertisement

బెంగళూరు లోని ఆమె ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అని అప్పట్లో తెగ చెప్పుకునేవారు.  తాజాగా యమున ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు.

ఆ విషయంపై ఎన్నో అసభ్యకరమైన వార్తలు వచ్చాయని… తన తప్పు లేదని కావాలని ఇరికించారని ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయాన్ని ఆమె షేర్ చేస్తూ తన బాధని చెప్పారు. ఒక వీడియో రూపంలో ఆమె తన బాధను మొత్తం పంచుకున్నారు. నేను నన్ను చాలా మోటివేట్ చేసుకున్నాను కానీ ఇంకా బాధ ఉండిపోయింది అని అన్నారు. ఒక సమస్య నుండి బయటికి వచ్చి ప్రశాంతంగా ఉన్నాను. ఆ సమస్యలో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇంటర్వ్యూలో చెప్పేసాను న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చిందని గెలిపించిందని… నేను గెలిచినా కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేకపోతున్నారని ఆమె చెప్పారు.

అలానే చాలా రకాల వీడియోలు వస్తున్నాయని వివిధ రకాలుగా థంబ్నెయిల్స్ పెట్టి నా గురించి మాట్లాడుతున్నారని చెప్పారు అయితే వీడియోలు చూడను కానీ థంబ్నెయిల్స్ నన్ను ఎంతో బాధ పెడుతున్నాయని… ఎంత నన్ను మోటివేట్ చేసుకున్న కూడా కష్టమవుతుందని ఏదో తెలియని బాధ నాలో ఉందని చెప్పారు యమున. చనిపోయినా కూడా వీళ్లు నన్ను వదలరేమో అని బాధపడ్డారు. నేను తెలియని వాళ్ళు నా గురించి తెలుసుకోండి. నా క్యారెక్టర్ ఏంటో తెలుసుకోండి అని యమున చెప్పారు. డబ్బులు కోసం రేటింగ్ ల కోసం ఇటువంటి వాటిని చేయొద్దని యమున అన్నారు.