యాక్టర్స్ అంటే నటులు. వాళ్ళ వృత్తి నటించడం. అంటే వాళ్ళ లాగా కాకుండా వేరే మనిషి లాగా ప్రవర్తించడం. కొంతమంది నటులు ఒక రకమైన పాత్రలని, అంటే వాళ్ల వయసుకు తగ్గ పాత్రలు మాత్రమే చేయడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ కొంతమంది మాత్రం ఎలాంటి పాత్ర అయినా, వాళ్ళ వయసు కంటే పెద్ద పాత్రలో అయినా, లేదా వాళ్ళ వయసు కంటే చిన్న పాత్రలో అయినా కూడా నటిస్తారు. ఆ పాత్రని కేవలం ఒక రోల్ లాగా మాత్రమే భావిస్తారు.

అలా ఒక యాక్టర్ తో కలిసి నటించిన వాళ్లు, తర్వాత అదే యాక్టర్ కి తోబుట్టువులా కానీ, లేదా తండ్రి, లేదా తల్లి పాత్రలో నటించారు. అలా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించిన ఇద్దరు హీరోయిన్లు తర్వాత చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లో ఆయనకి తల్లిలాగా నటించారు. వాళ్లే జయసుధ, సుజాత.

చిరంజీవి ఇంకా జయసుధ కలిసి మగధీరుడు సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇది కథ కాదు సినిమా లో కూడా నటించారు. తర్వాత చిరంజీవి హీరోగా నటించిన రిక్షావోడు సినిమాలో జయసుధ చిరంజీవి కి తల్లిగా నటించారు.

 

అలాగే చిరంజీవి, సుజాత కలిసి ప్రేమ తరంగాలు సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. తర్వాత సీత దేవి సినిమాలో అన్నా చెల్లెళ్ళు గా నటించారు. చిరంజీవి హీరోగా నటించిన బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి కి తల్లిగా నటించారు సుజాత.