చిన్న వయసులోనే మనకు దూరమైన 9 మంది హీరోయిన్లు… చాలావరకు మిస్టరీలే.!

చిన్న వయసులోనే మనకు దూరమైన 9 మంది హీరోయిన్లు… చాలావరకు మిస్టరీలే.!

by Harika

Ads

కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. నిన్నటి వరకు మనతో ఉన్న వ్యక్తి భవిష్యత్తు లో మనతోనే ఉంటారో లేదో చెప్పలేం. సినిమా సెలబ్రిటీలు మనకి వ్యక్తిగతంగా పరిచయం ఉండరు. అయినా సరే వాళ్లు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎవరో మన సొంత వాళ్ళు మనకి దూరం అయినట్టు అనిపిస్తుంది. ఎంతో మంది సినీ తారలు ఆరోగ్యం బాగా లేకపోవడం వలన, లేదా చెడు అలవాట్ల వలన లేదా ప్రమాదాల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్ళలో కొంతమంది యుక్తవయసులోనే తుది శ్వాస విడిచారు. అలా చిన్న వయసులో చనిపోయిన నటులలో కొంతమంది వీళ్లు.

Video Advertisement

#1 సావిత్రి (1936 – 1981) – 45 సంవత్సరాలు

కొన్ని అలవాట్ల కారణంగా సావిత్రి గారికి ఆరోగ్యం దెబ్బతింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సావిత్రి గారు కోమాలోకి వెళ్లిపోయారు. కోమాలో ఏడాదిపాటు ఉన్న సావిత్రి గారు ఒకరోజు ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయారు.

#2. భార్గవి (1983–2008) – 25 సంవత్సరాలు

అష్టా చెమ్మా సినిమాలో నానికి చెల్లెలిగా నటించారు భార్గవి. వాళ్ల ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదు అని భార్గవి తన బాయ్ ఫ్రెండ్ కలిసి ఆత్మహ-త్య చేసుకుని చనిపోదామని అనుకున్నారు. అలా ఆత్మహ-త్య చేసుకుని చనిపోయారు భార్గవి.

#3. సౌందర్య (1972–2004) – 31 సంవత్సరాలు

సావిత్రి తర్వాత అంత సహజంగా నటించగలరు అనే పేరు తెచ్చుకున్న నటి సౌందర్య. ఎన్నికల అప్పుడు ఒక రాజకీయ పార్టీకి తన వంతు మద్దతు గా ప్రచారం చేయడానికి వెళ్ళిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్య తో పాటు వెళ్ళిన తన అన్న కూడా చివరి శ్వాస విడిచారు.

#4. ప్రత్యూష (1981–2002) – 20 సంవత్సరాలు

శ్రీ రాములయ్య, స్నేహం అంటే ఇదేరా, కలుసుకోవాలని సినిమాల్లో నటించిన ప్రత్యూష వ్యక్తిగత సమస్యల కారణంగా ఆత్మహ-త్య చేసుకున్నారు. కానీ ప్రత్యూష తల్లి మాత్రం తన కూతురు ఆత్మహ-త్య కాదు హ-త్య అని అంటున్నారు. ఇందులో ఏది నిజం అనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు.

#5. జియాఖాన్

నిశ్శబ్ద్, గజినీ (హిందీ), హౌస్ ఫుల్ సినిమాల్లో నటించారు జియాఖాన్. ప్రేమించిన వ్యక్తి తో గొడవల కారణంగా మనస్తాపానికి గురైన జియాఖాన్ ఆత్మహ-త్య చేసుకున్నారు.

#6. దివ్యభారతి (1974–1993) – 19 సంవత్సరాలు

చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దివ్యభారతి కొద్ది కాలంలోనే ఎంతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఒకరోజు పై అంతస్తులో ఉన్న తన నివాసంలో బాల్కనీ లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి చనిపోయారు. అప్పటికి దివ్యభారతి వయసు 19 సంవత్సరాలు.

#7. సిల్క్ స్మిత (1960–1996) – 35 సంవత్సరాలు

అప్పట్లో స్పెషల్ సాంగ్స్ అంటే అందులో కచ్చితంగా సిల్క్ స్మిత ఉండేవారు. ఎన్నో పాటలు లో హీరోలకు దీటుగా డాన్స్ చేసే వారు సిల్క్ స్మిత. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ముఖ్య పాత్రలు పోషించారు. మేకప్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టి తర్వాత ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే అంత పేరు సంపాదించారు. వ్యక్తిగత సమస్యల కారణంగా ఉరి వేసుకుని చనిపోయారు. కానీ ఆమె చనిపోవడానికి ఎన్నో రకాల కారణాలు వినిపించాయి. అసలు ఆమె ఆత్మహ-త్యకు గల కారణం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.

#8. ఆర్తి అగర్వాల్ (1984–2015) – 31 సంవత్సరాలు

ఎన్నో సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల జాబితాలో ఉన్నారు ఆర్తీఅగర్వాల్. మధ్యలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టారు. లైపోసెక్షన్ ఆపరేషన్ జరిగినప్పుడు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు.

3arthi

#9. జయలక్ష్మి:

అంతులేని కథ సినిమా ద్వారా అప్పట్లో ఫేమస్ అయిన జయలక్ష్మి 22 యేళ్ల చిన్న వయసులోనే ఆత్మహ-త్య చేసుకొని మరణించారు. అప్పట్లో ఓ బడా హీరో కొడుకుతో వచ్చిన వివాదం కారణంగా ఆమె ఇలా చేసారంటూ వార్తలు వచ్చాయి.

 


End of Article

You may also like