పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్   జూన్ 16న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడిగా నటిస్తున్నారు. హీరోయిన్ కృతి సనన్ సీతగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ రావణుడి క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

Video Advertisement

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది. దీంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని సమాచారం. అయితే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్, కృతి సనన్ లు సీతారాములుగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాని తానాజీ సినిమా దర్శకుడు ఓం రౌత్ దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఓం రౌత్ తో కలిసి టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించాయి. జూన్ 16న రిలీజ్ కాబోతున్నఈ చిత్రం ప్రీ రిలీజ్ డీల్స్ ఇప్పటికే పూర్తి అయ్యాయి. మొత్తం ఐదు భాషలలో ఈ మూవీ పై 550 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటిదాకా ఇదే అతిపెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ అని సమాచారం.
ఈ మూవీ డిజిటల్ శాటిలైట్ రైట్స్ కి 250 కోట్లు ఇప్పటికే ప్రొడ్యూసర్ కి వచ్చాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో 185 కోట్లకి రైట్స్ ని తీసుకుంది. హిందీ, ఓవర్సీస్ మరియు ఇతర భాషలలో టి-సిరీస్ భూషణ్ కుమార్ సొంతంగా విడుదల చేస్తున్నారు. ఇక ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ మాత్రం టి-సిరీస్ అమ్మలేదని తెలుస్తోంది. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏరియా వైజ్ గా ఫ్యాన్సీ రేటుకి లోకల్ డిస్టిబ్యూటర్స్ రైట్స్ ని తీసుకున్నారు.
మొత్తంగా చూసుకుంటే ఆదిపురుష్ పై 550 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు 350 కోట్లు భూషణ్ కుమార్ పెట్టారు. ఇక డిజిటల్ శాటిలైట్ రైట్స్ తోనే 75 శాతం వరకు బడ్జెట్ రికవరీ అయ్యింది. అందువల్ల పాజిటివ్ టాక్ తో ఒక వారం ఆడితే, ప్రొడ్యూసర్స్ కి లాభాలు రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

Also Read: లోకేష్ కనగరాజ్ స్టోరీ… విజయ్ సేతుపతి హీరో..! ఈ సినిమా గురించి తెలుసా..?