“రావణాసురుడి తలలని ఇలా చూపించారు ఏంటి..?” అని ట్రోల్ చేశాం..! కానీ ఇదే నిజమా..?

“రావణాసురుడి తలలని ఇలా చూపించారు ఏంటి..?” అని ట్రోల్ చేశాం..! కానీ ఇదే నిజమా..?

by kavitha

Ads

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని సాధిస్తుందని ఆశించినవారిని నిరాశపరిచింది. అది మాత్రమే కాకుండా తీవ్రమైన విమర్శలను, వివాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందు ఎంత హైప్ ఉందో, రిలీజ్ తరువాత అంతగా వివాదాలను తెచ్చుకుంది.

Video Advertisement

ఇక సోషల్ మీడియాలో ఆదిపురుష్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు రామాయణం ను అపహాస్యం చేశారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం మూవీ యూనిట్ ను సమర్ధిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Angkor-wat-temple-in-cambodiaప్రభాస్, కృతి సనన్ లు సీతారాములుగా నటించిన ఈ చిత్రాన్ని తానాజీ వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించామని, రిలీజ్ కు ముందు మేకర్స్ అన్నారు. కానీ మూవీ రిలీజ్ అయిన తరువాత విజువల్ ఎఫెక్ట్స్ పైనా, పాత్రల వస్త్రధారణ పైన, ముఖ్యంగా రావణుడి పత్ర చిత్రీకరణ పైన తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. లంక సెట్ ను కూడా హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
raavan-in-adipurushరావణుడు వాహనంగా ఉపయోగించిన పక్షిని, రావణాసురుడి పది తలలను ఒకేవరుసలో చూపించకుండా ఒకదాని పైన మరొక వారుసను చూపించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ప్రభాస్ రాజు ఫ్యాన్ పేజ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో రావణాసురుడి తలలను అలా చూపించడాన్ని సపోర్ట్ చేసినట్లుగా ఉంది. ఆ వీడియోలో “మనకు తెలిసిన సింపుల్ విషయం.
అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసిన దర్శకుడు ఓం రౌత్ కు తెలియదనుకోవాలా? అయితే దానికి కూడా ఒక ఆధారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన అంగ్కోర్ వాట్ టెంపుల్ గోడలపై రావణుడి దశకంఠ రూపం 10 తలలు అడ్డంగా ఒకేవరుసలో కాకుండా త్రికోణాకారంలో 3 అంచెలలో అమర్చబడి కనిపిస్తాయి. ఆదిపురుష్ సినిమాలో అంగ్కోర్ వాట్ టెంపుల్ గోడలపై ఉన్నట్టుగానే చూపించారు” అని చెప్పుకొచ్చారు.

https://www.instagram.com/reel/CtrTptCpGw-/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: రావణుడు సీతని తీసుకెళ్ళేటప్పుడు గాలిలోనే ఎందుకు తీసుకెళ్ళాడు? తాకకపోవడానికి కారణం ఇదే.!


End of Article

You may also like