రావణుడు సీతని తీసుకెళ్ళేటప్పుడు గాలిలోనే ఎందుకు తీసుకెళ్ళాడు? తాకకపోవడానికి కారణం ఇదే.!

రావణుడు సీతని తీసుకెళ్ళేటప్పుడు గాలిలోనే ఎందుకు తీసుకెళ్ళాడు? తాకకపోవడానికి కారణం ఇదే.!

by kavitha

Ads

ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మొదలైన విమర్శలు, వివాదాలు సినిమా విడుదలైన తరువాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిపురుష్ రూపొందించిన దర్శకుడు ఓం రౌత్ ను, సంభాషణలు రాసిన రచయిత మనోజ్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనవసరం లేదు. తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Video Advertisement

రోజురోజుకు వివాదాలు పెరుగుతున్నాయి. హనుమంతుడి డైలాగ్స్, రాముడికి మీసాలు, వస్త్రధారణ, ముఖ్యంగా రావణాసురుడి పాత్ర, ఆహార్యం పై విమర్శలు వస్తున్నాయి. ట్రైలర్ లో రావణుడు సీతాదేవిని ముట్టుకోకుండా గాల్లో ఎత్తకెళ్లడం పై కూడా విమర్శలు వచ్చాయి. అలా తీసుకెళ్లడం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Sita-Haranరామాయణంలో కీలకమైన ఘట్టాలలో సీతాదేవి అపహరణ కూడా ఒకటి. అదే రావణాసురుడి చావుకు కారణం అయ్యింది. వనవాసంలో ఉన్న సమయంలో రావణాడు సీతాదేవిని ఎత్తుకెళ్లడం, ఆ తరువాత అశోకవనంలో బంధించిన విషయం తెలిసిందే. అయితే ఆదిపురుష్ లో రావణాడు సీతను పట్టుకోకుండా గాల్లో తీసుకెళ్తాడు. వాల్మీకి రామాయణంలో సీతాదేవి ఉన్న భూమిని పెకిలించి తీసుకెళ్లినట్టుగా ఉంటుంది. మరి రావణాడు సీతమ్మను తాకకుండా తీసుకెళ్లాడానికి కారణం కుబేరుడి కుమారుని శాపం.
రావణాసురుడు తనకి కోడలితో సమానం అయిన రంభను ఒకసారి బలవంతం చేస్తే, రంభ ప్రియుడు అయిన కుబేరుడి కుమారుడు నలకుబేరుడు రావణాసురుడు పరాయి స్త్రీని బలవంతంగా ముట్టుకుంటే రావణాసురుడి పది తలలు పగిలిపోయేలా శాపం పెడుతాడు. రావణాసురుడు సీతాదేవి అనుమతి లేకుండా ముట్టుకుంటే తన పది తలలు పగిలిపోతాయి. అందుకే రావణాడు సీతను గాల్లో తీసుకెళ్తాడు.ఆ తరువాత రావణాసురుడు సీతాదేవి తాకకుండా అశోకవనంలో ఉంచుతాడు. శ్రీ రాముడు ఆంజనేయుడి సహాయంతో లంకలో ఉన్న సీతాదేవి జాడను కనుగొని, వారధి కట్టి, రావణాసురుడితో యుద్ధం చేసి రావణుడిని సంహరించి సీతాదేవి తీసుకుని అయోధ్యకు చేరుకుంటాడు. నల కుబేరుడు శాపం వల్ల రావణాసురుడు సీతాదేవిని తాకడానికి భయపడతాడు.

Also Read: ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాని ట్రోల్ చేస్తున్న వారికి… చిలుకూరు ప్రధాన అర్చకులు స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అన్నారంటే..?

 


End of Article

You may also like