ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా రాబోతోంది. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉంది. ఎన్నో కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.

Video Advertisement

ఈ సినిమా కోసం ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు. అందు కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు లీక్ అయిన స్టిల్స్ కూడా జనాల్లో ఆసక్తిని పెంచాయి.

ఇక ఇది ఇలా ఉంటే ఆదిపురుష్ టీజర్ విడుదలవ్వాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దీని గురించి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ విడుదలయింది. ఇది నిజంగా ఫాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

ఉత్తరప్రదేశ్ అయోధ్య లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2వ తేదీన ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా టీజర్ ఉత్తర ప్రదేశ్ అయోధ్య లో విడుదల కానున్నట్లు సమాచారం అందింది. పైగా ఆది పురుష్ టీమ్ జర్నలిస్టులను కూడా తీసుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుండి జర్నలిస్టులు వెళ్లి దీనిని కవర్ చేయనున్నారు.

reason behind prabhas movies disappoing after bahubali

రామాయణం ఆధారంగా ఆది పురుష్ సినిమాని తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో రూపొందించనున్నారు. ఈ సినిమాలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రల్లో కనపడనున్నారు. ఆదిపురుష్ షూటింగ్ కూడా పూర్తి అయ్యి పోయింది. 2023 జనవరి 12న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి చూస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా తో బిజీగా ఉండగా.. ప్రశాంత్ నీల్ సలార్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ –K సినిమాలు కూడా ప్రభాస్ చేతి లో వున్నాయి. ప్రాజెక్ట్ –K లక్ష్యం అయితే పాన్ వరల్డ్ స్థాయి లో ఇంటర్నేషనల్ మార్కెట్స్‌ని రీచ్ అవ్వడమే.