Ads
ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
Video Advertisement
ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. అయితే ఇటీవల జబర్దస్త్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
టీవీ యాంకర్ గా మాత్రమే కాకుండా ఇప్పుడు నటిగా కూడా రాణిస్తున్నారు అనసూయ. అనసూయ జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కి కూడా యాంకర్ గా చేస్తారు అనసూయ. టీవీ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. క్షణం, రంగస్థలం సినిమాల్లో అనసూయ పోషించిన పాత్రలకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కూడా అనసూయ ఎన్నో సినిమాల్లో నటించారు.
ఇటీవల పుష్పలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు అనసూయ. సినిమా ఎండ్ అయిన విధానం చూస్తే పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా అనసూయ పాత్ర ఉంటుంది. అందులో అనసూయ పాత్ర ఒక ముఖ్య పాత్ర అని తెలుస్తోంది. అయితే అదిరే అభి అనసూయ గురించి మాట్లాడిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందులో అదిరే అభి అనసూయ గురించి మాట్లాడుతూ, “నువ్వు ముందు నుంచి ఎంత కష్టపడ్డావో ఈ స్థాయికి రావడానికి నువ్వు ఎన్ని కష్టాలని ఎదుర్కొన్నావో మాకు తెలుసు. నీ ఎదుగుదల ఎవరు పెట్టిన భిక్ష కాదు. నీకు నువ్వే కష్టపడి సంపాదించున్నావు” అని అదిరే అభి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
End of Article