పాపులర్ డాన్స్ షో ఢీ లో కొరియోగ్రాఫర్‌ గా పనిచేస్తున్న చైతన్య బలవన్మరణానికి పాల్పడిన విషయం అందరికి తెలిసిందే. చైతన్య మరణం గురించి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

Video Advertisement

మల్లెమాల ప్రొడక్షన్స్ తగిన రెమ్యూనరేషన్ ఇవ్వక పోవడంతోనే చైతన్య మాస్టర్ తన జీవితాన్ని ముగించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వివాదం పై తాజాగా జబర్దస్త్ కామెడీ షోలో గతంలో పనిచేసిన అదిరే అభి స్పందించాడు. అయితే ఈ విషయం గురించి అభి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
రీసెంట్ గా డాన్స్ మాస్టర్ చైతన్య నెల్లూరులో ఒక హోటల్ లో ఉరి వేసుకుని మరణించాడు. అతను మరణించే ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో అప్పుల వల్లనే ఇలా చేస్తున్నానని, జబర్దస్త్ లో ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇస్తారని, ఢీ షోలో తక్కువ  రెమ్యూనరేషన్‌ ఇస్తారని తెలిపాడు. దాంతో మల్లెమాల వారు ఢీ షోలో పనిచేసేవారికి తక్కువ  రెమ్యూనరేషన్‌ ఇవ్వడం వల్లనే అతను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని కామెంట్స్  చేస్తున్నారు.తాజాగా అదిరే అభి ఈ విషయం పై స్పందించాడు. చైతన్య మాస్టర్‌ మరణం నేపథ్యంలో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వారికి అదిరే అభి కొన్ని సూచనలు చేశాడు. అదిరే అభి తన ఇన్‌ స్టా గ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో సిని పరిశ్రమ లేదా టీవీ పరిశ్రమలోకి రావాలని అనుకునేవారికి, వచ్చే వారికి అంత తేలికగా అవకాశం దొరకదు. రెడ్‌ కార్పెట్‌ పరిచి స్వాగతం చెప్తారని అనుకోవడం, డబ్బులు బాగా ఇస్తారని అనుకోవడం చాలా పొరపాటు. ఇక్కడికి వచ్చాక ఎంతోమంది కష్టాలు పడి, తమ కడుపు మాడ్చుకొని, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపితే తప్ప ఒక బ్రేక్ రాదు.
ఆ బ్రేక్ వచ్చిన తరువాత కూడా దానిని కొనసాగించడం కూడా పెద్ద విషయమే. ఇవ్వన్ని చెప్పడానికి కారణం ఇండస్ట్రీలోకి రావలనుకునేవారు ఇవ్వని తెలుసుకొని మానసికంగా సిద్ధపడి వస్తే, వచ్చాక ఏర్పడిన కష్టాలను ఎదుర్కోవచ్చు. అలాగే ప్లాన్ బి కూడా పెట్టుకుంటే కాస్త ధైర్యంగా ఉంటారు. అలాగే వచ్చిన ఆదాయంలో కూడా కొంచెం దాచుకోవడం వల్ల కష్టకాలంలో ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ఒకటి రెండు చిత్రాలలో నటించిన తర్వాత కానీ, రెండు మూడు షోలలో చేసిన తర్వాత అయిన ఇబ్బందులు ఎదురు కావచ్చు.
అంత పెద్ద స్టార్ అమితాబచ్చన్‌ కూడా 1990 చివర్లో ప్రొడ్యూసర్ గా 100 కోట్లకు పైగా నష్టాలను చూశారు. అయితే అమితాబ్ ‘కౌన్ బనేగా కరోడ్‌ పతి’ షోతో మళ్లీ డబ్బులు సంపాదించారు. కాబట్టి కెరీర్‌ లో ఏ టైమ్ లో అయినా  ఇబ్బందులు రావచ్చు. వాటి కోసం జీవితానికి ముగింపు పలికే నిర్ణయాలు తీసుకోవద్దని అభి చెప్పుకొచ్చాడు. అలాగే షోకి వచ్చే రేటింగ్ ను బట్టి రెమ్యూనరేషన్‌ ఇస్తారని, జబర్దస్త్ షోకి రేటింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అందులో పని చేసేవారికి రెమ్యూనరేషన్‌ ఎక్కువ ఇస్తారని చెప్పుకొచ్చారు.

Also Read: UGRAM REVIEW : పోలీస్ ఆఫీసర్ గా “అల్లరి నరేష్” ఆకట్టుకున్నారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!