• చిత్రం : హిట్ 2
 • నటీనటులు : అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ల భరణి, కోమలి ప్రసాద్.
 • నిర్మాత : ప్రశాంతి తిపిర్నేని, నాని (వాల్ పోస్టర్ సినిమా)
 • దర్శకత్వం : శైలేష్ కొలను
 • సంగీతం : ఎంఎం శ్రీ లేఖ, సురేష్ బొబ్బిలి
 • విడుదల తేదీ : డిసెంబర్ 2, 2022

hit 2 review

Video Advertisement

స్టోరీ :

సినిమా హర్షవర్ధన్ భార్య పాత్రతో మొదలు అవుతుంది. కృష్ణ దేవ్ (అడివి శేష్) వైజాగ్ కి ఎస్పీగా వస్తాడు. ఆర్య (మీనాక్షి చౌదరి) అతని గర్ల్ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ లివ్ ఇన్ లో ఉంటారు. తర్వాత అక్కడి సోషల్ పబ్ లో సంజన అనే ఒక అమ్మాయి మర్డర్ జరుగుతుంది. తర్వాత చూస్తే అది ఒకరు కాదు నలుగురు ఒకటే చోట హత్య చేయబడ్డారు అని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసే పనిలో కృష్ణ దేవ్ ఉంటాడు. అదే సమయంలో ఆ హత్యలు చేసిన వ్యక్తి కృష్ణ దేవ్ కి మరి కొన్ని హత్యలు చేయబోతున్నట్టు చెప్తాడు. ఈ విషయాన్ని కృష్ణ దేవ్ ఎలా కనిపెట్టాడు? అసలు హంతకులు ఎవరు? ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు? చివరికి ఇవన్నీటిని కృష్ణ దేవ్ ఆపగలిగాడా? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

hit 2 review

రివ్యూ :

మంచి కథలను ఎంచుకోవడంలో, వాటిని తెరపై చూపించి సక్సెస్ అవ్వడంలో ఇటీవలి కాలంలో చాలా గొప్ప గుర్తింపు పొందిన హీరో అడివి శేష్. అడివి శేష్ మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి రచయిత కూడా అని తన గత చిత్రాలు చూస్తే అర్థం అవుతుంది. ఆ సినిమాలు అన్నీ కూడా ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కి చెందినవి. దాంతో అడవి శేష్ అంటే ఇలాంటి సినిమాలు చాలా బాగా చేస్తారు అని అంటారు.

hit 2 review

ఇప్పుడు ఈ సినిమా కూడా దగ్గర దగ్గర అలాంటి కథతోనే వచ్చింది. మొదటి భాగం అయిన హిట్ లాక్‌డౌన్‌ కి ముందు విడుదల అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా కథ కూడా ఒక అమ్మాయి మరణించడం, ఆ మిస్టరీ సాల్వ్ చేయడం అలాగే ఉంటుంది. కానీ కథలో కొన్ని బలమైన పాయింట్స్ ఈ సారి యాడ్ చేశారు. సినిమా మొత్తం కూడా నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ తో నడుస్తోంది.

hit 2 review

ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన అంశాలు అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో సగం జరిగిన తర్వాత సినిమాలో హత్యలు చేసేది ఎవరు అనేది తెలిసిపోతుంది. దాంతో కొంచెం సస్పెన్స్ తగ్గిందేమో అనిపిస్తుంటుంది. కానీ సినిమా చివరిలో మళ్లీ నెక్స్ట్ పార్ట్ కి సంబంధించి ఒక పెద్ద విషయాన్ని చెప్తారు. దాంతో ఇప్పుడు ఈ సినిమాకి మాత్రమే కాదు నెక్స్ట్ సినిమాకి కూడా ఇప్పటినుంచి సస్పెన్స్ స్టార్ట్ చేశారు అని అనిపిస్తుంది.

hit 2 review

కానీ హంతకుడిగా చూపించిన వ్యక్తి మాత్రం అతను కాకుండా ఇంకా ఎవరినైనా ఈ పాత్రలో పెట్టి ఉంటే బాగుండేది ఏమో అని అనిపిస్తుంది. ఈ పాత్రకి ఆ నటుడు అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే సినిమాలో నిజంగా హంతకుడు ఎవరు అని కనిపెట్టడం మాత్రం ప్రేక్షకులకు చాలా కష్టం. నిజంగా హంతకుడు ఎవరు అని తెలిసిన తర్వాత ప్రేక్షకులు అందరూ కూడా ఒకసారి షాక్ కి గురవుతారు.

ప్లస్ పాయింట్స్ :

 • కథ
 • స్క్రీన్ ప్లే
 • నటీనటుల పెర్ఫార్మెన్స్
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • సినిమాటోగ్రఫీ
 • సినిమా చివరి వరకు సస్పెన్స్ ని అలాగే ఎక్కడా తగ్గకుండా చూడడం

మైనస్ పాయింట్స్:

 • సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
 • హంతకుడి పాత్ర

రేటింగ్ :

3.25/5

ట్యాగ్ లైన్ :

మొదటి పార్ట్ అయిన హిట్ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా ఎంత గుర్తింపు అయితే సంపాదించుకుందో, ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే మంచి స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకి ఎక్కడా కూడా ఆసక్తి తగ్గనివ్వకుండా చేస్తుంది. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఎక్కువగా ఇష్టపడే వారిని, అలాగే మొదటి పార్ట్ చూసినా చూడకపోయినా కూడా, ఒకవేళ చూసి ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులని కూడా హిట్-2 సినిమా అస్సలు నిరాశ పరచదు.