Ads
ఓటీటీలో రోజుకి ఒక కొత్త సినిమా విడుదల అవుతుంది. ఎన్నో భాషల కంటెంట్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. అలా ఇటీవల ఒక సినిమా వచ్చింది. ఈ సినిమా సస్పెన్స్ తో సాగుతుంది. ఆ సినిమా పేరు అదృశ్యం. ఈటీవీ విన్ లో విడుదలైన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి ముఖ్య పాత్రలో నటించారు. మలయాళం సినిమా అయిన ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇంక కథ విషయానికి వస్తే, అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కి ఒక అమ్మాయి వెళ్లి తాను ఒకరిని చంపాను అని చెప్తుంది. కానీ మిగిలిన వివరాలు ఏవి చెప్పదు.
Video Advertisement
ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సాధారణంగానే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని చాలా మంది ఇష్టపడతారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి సినిమానే. మొదటి నుండి చివరి వరకు ఆ సస్పెన్స్ అనేది సినిమా అంతా క్యారీ చేశారు. తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి సినిమా చూస్తున్నప్పుడు నెలకొంటుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సినిమా సస్పెన్స్ కి వాళ్ళ నటన ఇంకా ప్రధాన బలంగా నిలిచింది. అపర్ణ బాలమురళితో పాటు, ఈ సినిమాలో హరీష్ ఉత్తమన్, కళాభవన్ షాజోన్, సిద్ధిక్, చందునాథ్ జి నాయర్ ముఖ్య పాత్రలు పోషించారు.
జానకి అనే ఒక పాత్రలో అపర్ణ బాలమురళి నటించారు. తన పాత్రకి అపర్ణ బాలమురళి న్యాయం చేశారు. ఈ సినిమాకి సుధీష్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. అరుణ్ రాజ్, వరుణ్ రాజ్ ఈ సినిమాని నిర్మించారు. డైరెక్ట్ ఓటీటీలోనే ఈ సినిమా విడుదల అయింది. రంజిత్ ఉన్ని ఈ సినిమాని రాశారు. చాలా తక్కువ మంది పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తారు. కానీ ఉన్న ప్రతి పాత్ర కూడా గుర్తు ఉండే అంత బాగా నటించారు. దర్శకుడు చాలా నీట్ గా సినిమాని ప్రజెంట్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.
ALSO READ : 2023 లో ట్రోల్ చేసారు… 2024 లో పొగుడుతున్నారు..! ఆ నిర్ణయమే ఈ మార్పుకి కారణమైంది.!
End of Article