25 ఏళ్ళు దాటిన తర్వాత ఆడ పిల్ల పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా?

25 ఏళ్ళు దాటిన తర్వాత ఆడ పిల్ల పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా?

by Mohana Priya

Ads

మామూలుగా 20 సంవత్సరాలు దాటిన ఆడపిల్లని ఎక్కడికి వెళ్ళినా వేసే ఒకటే ప్రశ్న పెళ్లెప్పుడు అని. ఇంక 25 ఏళ్లు దాటితే చాలా ఆలస్యం అయిపోయింది అని ఇప్పుడు ఇంక పెళ్లి అవడం కూడా చాలా కష్టం అని ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఆలస్యం అని కారణం అడిగితే ఒక్కళ్ళు సరిగ్గా చెప్పరు.ఎందుకంటే కారణం వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి. అందరూ వెళ్తున్నారు కాబట్టి అదే బాటలో మనం కూడా పయనించాలి అని మాట్లాడతారు. కానీ సైన్స్ ప్రకారం అమ్మాయిలు 25 ఏళ్లు పైబడిన తర్వాత చేసుకుంటేనే మంచిదట. ఎందుకంటే.

Video Advertisement

సర్వే ప్రకారం 25 వయసు పైబడిన వాళ్లలో ఆర్థిక స్వాతంత్రం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎక్కడికి వెళ్ళినా బ్రతక గలము అని ఒక ధైర్యం వస్తుంది. అందుకే ముందు చదువు పూర్తి చేసి తర్వాత మీ లక్ష్యాన్ని సాధిస్తే ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.

ఆలోచనలు కూడా మెచ్యూర్డ్ గా ఉంటాయి. ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా అన్ని పరిశీలించి తీసుకునే అంత సామర్థ్యం వస్తుంది. మానసిక బలం వస్తుంది. ఏది మంచో ఏది చెడో ఏది వారికి కరెక్టో ఏది వారికి కరెక్ట్ కాదో తెలుసుకోగలరు. సొసైటీ ని కూడా హ్యాండిల్ చేయగలుగుతారు.

వయసుకి పరిణితికి సంబంధం లేదన్న మాట నిజమే కానీ చాలా చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీ ఉన్న మనుషులు చాలా తక్కువగా ఉంటారు.చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వలన డివోర్స్ శాతం కూడా పెరుగుతోంది. దాంతో సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉన్నప్పుడే ఎలిజిబుల్ అవుతారు అని చెప్తున్నారు.

కమ్యూనికేషన్ కూడా బలంగా ఉంటుంది. ముందు తెలిసి తెలియక పోవడం వల్ల లేదా భయం వల్ల చాలా విషయాలు వ్యక్తపరచడానికి కుదరదు. 25 దాటిన తర్వాత సమాజాన్ని చూస్తారు కాబట్టి కొంచెం భయం బెరుకు పోతుంది. దాంతో ఏదైనా వారికి అక్కర్లేదు అంటే వద్దు అని, లేదా కావాల్సినవి కావాలి అని గట్టిగా చెప్పగలుగుతారు.అన్ని విషయాల్లో ఒక స్పష్టత వస్తుంది.

మనం మామూలుగా 20 మొదలైన అప్పుడే ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది అని అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే వయసు పెరిగే కొద్దీ మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. వయసుతో పాటు మనం ఎన్నో ఒడిదుడుకులను చూసి ఉంటాం కాబట్టి మనమేంటో మనకేం కావాలో అనే విషయం మనకు తెలుసు. ఇంకా మనల్ని మనం బాగా అర్థం చేసుకోగలం. దాంతో వేరే వాళ్లు కూడా మన విషయాలను సులువుగా అర్థం చేసుకుంటారు.

ఇవి 25 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అని సైకాలజిస్టులు పరిశోధించి చెప్పిన విషయాలు.


End of Article

You may also like