మరోసారి నెటిజెన్ల ట్రోలింగ్‌కి గురవుతున్న “ఉపాసన”.. అసలు కారణం ఏంటంటే..?

మరోసారి నెటిజెన్ల ట్రోలింగ్‌కి గురవుతున్న “ఉపాసన”.. అసలు కారణం ఏంటంటే..?

by Megha Varna

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ఉపాసన. అలానే సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఎంతో మందికి సేవలను అందిస్తున్నారు.

Video Advertisement

ఫిట్ నెస్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఉపాసనపై ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. గతంలో ఒక గుడి గోపురం ఫోటోని షేర్ చేసి విపరీతమైన ట్రోల్స్ కి గురయ్యారు.

గుడి గోపురంపై మనుషులు ఏంటి అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి పోస్టులు పెట్టి మీపై ఉన్న గౌరవం తగ్గించుకోవద్దు అని కూడా అన్నారు. ఇదిలా ఉంటే ఒక జర్నలిస్టు చేసిన ఇంటర్వ్యూలో ఉపాసన షేర్ చేసుకున్న విషయాలు వైరల్ గా మారాయి.

మెడిసిన్ తీసుకునేటప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని చదివితే… ఆ మెడిసిన్ మరింత బాగా పని చేస్తుందని ఎక్కడో చదివానని ఉపాసన అన్నారు. పైగా మెడిసిన్ లో జనం నెగిటివిటీ చూస్తారు. రోగం ఉంటేనే కదా మెడిసిన్ తీసుకునేది. కానీ అలాంటి నెగిటివిటీని పక్కన పెట్టాలి. అయితే దాన్ని తగ్గించడానికి పాజిటివిటీ కావాలి. పాజిటివిటీ ఎలా వస్తుంది అంటే మృత్యుంజయ మంత్రం చదివితే వస్తుంది అని చెప్పారు. ఈ మంత్రమే కాకుండా అల్లాని కానీ క్రీస్తుని కానీ తలచుకోవచ్చు.

ఇలా చేస్తే పాజిటివిటీ, ఒక రకమైన నమ్మకం వస్తుందని తనకి ఎవరో చెప్పారని అన్నారు. అయితే ఆమె చెప్పిన ఈ విషయాన్ని ఎవరూ ఒప్పుకోవడం లేదు. పైగా “అంత పేరున్న ప్రముఖ హాస్పిటల్ గ్రూప్ వైస్ చైర్ పర్సన్ అయి ఉండి, ఇలా మాట్లాడతారా?” అని అందరూ అంటున్నారు. “తాయత్తులు అమ్మే వాళ్ళు తరహాలో మాట్లాడుతున్నావ్” అని ఆమెని ట్రోల్ చేస్తున్నారు. అయితే నిజానికి ఈమె చెప్పిన దానిని తప్పుపట్టాల్సిన పనిలేదు. అందర్నీ పాటించమని అనడం లేదు. ఎక్కడో చదివానని మాత్రమే చెప్పారు. నచ్చిన వాళ్ళు అనుసరించవచ్చు లేకపోతే లైట్ తీసుకో వచ్చు. కానీ ఈమెపై మండిపడాల్సిన పనైతే ఏమి లేదు.

watch video :

 


End of Article

You may also like