Ads
నేటి డిజిటల్ యుగం లో కూడా ఆడపిల్లల పట్ల వివక్ష చూపించడం తగ్గలేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు వెళ్తున్నారు. కాలం మారి, దేశం అభివృద్ధి దిశగా పయనిస్తున్న ఈ రోజుల్లో కూడా.. ఆడపిల్ల పుడితే.. ఏ చెత్తకుప్పలో పడేయాల్సి వస్తుందో అని భయపడుతున్న మహిళలు ఉన్నారంటే నమ్ముతారా..? ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ అలాంటిదే.
Video Advertisement
నాలుగేళ్ళ క్రితం గుజరాత్ లో ఇలాంటి స్టోరీ నే చోటు చేసుకుంది. ఓ దంపతులకు ఆడపిల్ల పుట్టడం తో.. ఆమెను చెత్తకుప్పల్లో పడేసారు. ఆ పిల్ల గుక్క పెట్టి ఏడుస్తుంటే.. అక్కడి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకొని ఆ పసికందుని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తరువాత ఆమె బతికింది.
కానీ, ఆమెను తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడం తో ఏమి చేయలేక ఆ అధికారులు ఆ చిన్నారిని అహ్మదాబాద్ లోని చిల్డ్రన్స్ హోమ్ లో చేర్పించారు. అక్కడే ఆ పిల్ల ఆలనా పాలనా చూసేవారు. కానీ విధి ఎంత చిత్రమైనది. ఆమెను పెంచుకోవడానికి దేశం కానీ దేశం నుంచి ఓ దంపతులు ముందుకొచ్చారు. ఆమెను కన్నవాళ్ళు కాదనుకున్నా.. తాము పెంచుకుంటాం అంటూ అమెరికా కు చెందిన నాథన్, థాంమ్సన్ దంపతులు ముందుకొచ్చారు.
ఇప్పటివరకు ఆ చిన్నారికి అర్పిత అని పేరు పెట్టారు. నాథన్ దంపతులు ఆమెను ముద్దు గా జాయ్ అని పిల్చుకుంటున్నారు. దత్తత స్వీకారం కోసం జరగాల్సిన పనులు పూర్తయ్యాక ఆ పాపను అమెరికా కు తీసుకెళ్ళిపోతామని వారు చెప్పారు. ఈ క్రమం లో జిల్లా కలెక్టర్ సందీప్ సాంగ్లే కూడా అర్పిత ఉంటున్న చిల్డ్రన్ హోమ్ ను సందర్శించారు. ఎవరి జీవితం లో ఏమి జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. ఆ పిల్ల ఇకనైనా సంతోషం గా ఉండాలని కోరుకుందాం.
End of Article