Ads
తెలుగులో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. వారందరిలో బాగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పటికీ జనాలకు టక్కున గుర్తుచే వ్యక్తి ఆహుతి ప్రసాద్. తన మాటతీరుతో బాడీ లాంగ్వేజ్ తో తననాటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.
Video Advertisement
150పైగా చిత్రాల్లో నటించిన నటుడాయన. తమిళ, హిందీ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేసారు. వెండి తెరపై నటుడిగా చెరగని ముద్ర వేసారు. హాస్య పాత్రలతోపాటు ప్రతి నాయకుడిగా పాత్రల్లోనూ గొప్ప పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కామెడీ పాత్రలకు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. గోదావరి వేసవి ఆయన డైలాగ్ డెలివరీతో భలే పలికించేవారు.
అయితే ఆహుతి ప్రసాద్ కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారని సంగతి తెలిసింది. ఆయన ఎలా చనిపోయారు అనే విషయాన్ని ఆయన కొడుకు కార్తిక్ ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు. ఆహుతి ప్రసాద్ క్యాన్సర్ వ్యాధి ఉన్నదట. అయితే ఆ విషయాన్ని బయట పెట్టకుండా దాచేవారని చెప్పుకొచ్చాడు. దాని వెనకాల కూడా ఒక కారణం ఉందని అన్నారు.
తనకి క్యాన్సర్ ఉందని తెలిస్తే ఇండస్ట్రీలో ఆఫర్లు ఇవ్వరని, ఒకవేళ తెలిసినా కొంతమంది సానుభూతి చూపిస్తే… మరికొందరు చులకనగా చూస్తారని అందుచేతనే ఆ విషయాన్ని తన తండ్రి దాచిపెట్టినట్లుగా చెప్పాడు. తన చివరి రోజుల్లో ఆయన తన సొంత ఊర్లో గడపాలి అనుకున్నారని, కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయినట్లు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం కార్తీక్ సినిమాలో నటిస్తున్నాడట టక్ జగదీష్, మాసూద సినిమాలు తనకి గుర్తింపు తీసుకువచ్చాయని, మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలని తన తండ్రి పేరు నిలబెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పాడు
End of Article