తన బిడ్డకి జరిగినట్టు ఏ పసిపిల్లలకు జరగద్దు అని వ్యాపారవేత్తగా మారింది…ఇప్పుడు నెలకి 5 లక్షలు సంపాదిస్తున్న ఐశ్వర్య.!

తన బిడ్డకి జరిగినట్టు ఏ పసిపిల్లలకు జరగద్దు అని వ్యాపారవేత్తగా మారింది…ఇప్పుడు నెలకి 5 లక్షలు సంపాదిస్తున్న ఐశ్వర్య.!

by Megha Varna

Ads

డబ్బులు సంపాదించడానికి చాలా దారులు ఉంటాయి. కేవలం ఉద్యోగం మాత్రమే చెయ్యక్కర్లేదు. అదే విధంగా ఎటువంటి వ్యాపారం చెయ్యాలనే ఆలోచన లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఐడియా మనకి రావచ్చు.

Video Advertisement

అలాంటిదే ఐశ్వర్య రవి జీవితం. 2015లో తన బిడ్డకి చర్మంపై ర్యాషెస్ రావడంతో ఆమె వ్యాపారవేత్తగా మారిపోయింది. చిన్నపిల్లలకి షాంపూలు, సబ్బులు ఉపయోగించినప్పుడు నెగిటివ్ రియాక్షన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

తన బిడ్డకి కూడా అలానే చర్మంపై ర్యాషెస్ రావడం జరిగింది. వెంటనే ఆమె భయపడింది. పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్లి ఆమె అడగగా ఐశ్వర్య తన బిడ్డకి వాడుతున్న ప్రొడక్ట్స్ ని ఆపేయమన్నారు. ప్రొడక్ట్స్ లో ఉపయోగించే కెమికల్స్ కారణంగా చర్మంపై సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెప్పారు. అయితే ఇలాంటి సమస్యలతో చాలా మంది తల్లులు సతమతమవుతున్నారు కదా అని వెంటనే ఆమెకి ఒక ఆలోచన వచ్చింది.

అదే కెమికల్స్ లేకుండా షాంపూలు మొదలైన ప్రోడక్ట్ తయారు చేయడం. శనగపిండితో పాటు ఇతర మూలికలను ఉపయోగించి ఫేస్ వాష్ అలానే కొన్ని నూనెలని, పువ్వులని ఉపయోగించి హెయిర్ వాష్ వంటి వాటిని ఆమె తయారు చేయడం మొదలు పెట్టింది. ఐశ్వర్య తన తల్లి మరియు అమ్మమ్మ సలహా కూడా ఇందులో తీసుకుంది. చాలా ప్రొడక్ట్స్ ని ఈమె తన వంటగదిలో చేయడం మొదలుపెట్టింది.

ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయని చర్మం కూడా ఎంతో సాఫ్ట్ గా అవుతోందని ఆమె గ్రహించింది. కొన్ని నెలల తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ని ఇచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా వ్యాపారంని స్టార్ట్ చేసింది. ఇదే ఆమెకు నిజంగా జీవితంలో పెద్ద మలుపు. షాంపూలు, కండిషనర్లు, మాయిశ్చరైజర్లు మొదలైన వాటిని ఈమె తయారుచేసి కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఇచ్చి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇక ఆమె ఈ వ్యాపారాన్ని కొనసాగించింది.

వీటిని చేయడానికి నలుగురి మహిళలని కూడా ఆమె పనిలో పెట్టుకుంది. ఇప్పుడు ఆమె అరవై ఐదు రకాల ప్రొడక్ట్స్ ని తయారుచేసి బిజినెస్ చేస్తున్నారు. నెలకి ఆమెకి 500పైగా ఆర్డర్లు వస్తాయి. రూ.5 లక్షలని నెలకి ఆమె సంపాదిస్తోంది. ఆలోచన చిన్నదైనా పెద్దదైనా చేయాలనే తపన.. సక్సస్ అవుతాననే పట్టుదల ఉంటే ఎవరికైనా ఏదైనా సాధ్యం. చాలా మంది మహిళలకి క్రియేటివిటీ వున్నా నమ్మకం తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ ఐశ్వర్య లాంటి మహిళలని ఆదర్శంగా తీసుకోవాలి.


End of Article

You may also like