Ads
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. టెక్నాలజీని వాడుకుని సినిమా శైలిని మార్చేశారు. రాంగోపాల్ వర్మ సినిమాలు, ఆయన పెట్టే ఫ్రేమ్ లు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అయితే తాజాగా రాంగోపాల్ వర్మ ఫామ్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
Video Advertisement
అయితే రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యురీకం చేసి ఎంతోమంది డైరెక్టర్లు అయ్యారు. వారిలో పూరి జగన్నాథ్, కృష్ణవంశీ తదితరులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.
అయితే రాంగోపాల్ వర్మ దగ్గర పనిచేసిన అజయ్ భూపతి ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆర్ఎక్స్ 100 సినిమా తో సూపర్ హిట్ కొట్టారు. తర్వాత మహాసముద్రం సినిమా తీసిన అది అంతగా ఆడలేదు. ఇప్పుడు మూడో సినిమాగా మంగళవారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా మంచి రెస్పాన్స్ సాధించుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన గురువు రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన చేసే సినిమాలు తనకు నచ్చవని కానీ ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని అన్నారు.
వర్మ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తారు గాని, నిజానికి ఆయన వ్యక్తిత్వం అది కాదని, అది బాగా దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఆయనలో ఉన్న ఒరిజినల్ ఫిలిం మేకర్ బయటకు వస్తే ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా వర్మ ఉంటారని అన్నారు.
ఆయన మన పక్కనే ఉంటారు కానీ సోషల్ మీడియాలో ఏదో కామెంట్ పెడుతూ ఉంటారు అది మనకు కూడా తెలియదు అని చెప్పుకొచ్చారు.ఒక్కొ వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది కానీ RGV లాంటి వారు చాలా అరుదు. ఇలాంటి వారు చనిపోయాక గాని వారి విలువ మనకు తెలియదని అన్నారు.
Also Read:సైలెంట్ గా స్టార్ట్ అయిన మెగాస్టార్ సినిమా షూటింగ్..!
End of Article