సైలెంట్ గా స్టార్ట్ అయిన మెగాస్టార్ సినిమా షూటింగ్..!

సైలెంట్ గా స్టార్ట్ అయిన మెగాస్టార్ సినిమా షూటింగ్..!

by Mohana Priya

Ads

చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ ఇవాళ మొదలు పెట్టారు. బింబిసార సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మారేడుమిల్లి అడవుల్లో సినిమా షూటింగ్ మొదలు అయినట్టు సమాచారం.

Video Advertisement

ఈ సినిమా సోషల్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించిన మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఒక సోషియో ఫాంటసీ సినిమా.

ఇప్పుడు మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో ఆ సోషియో ఫాంటసీ జోనర్ సినిమాలో మళ్లీ నటిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు అని సమాచారం. వారి గురించి ఇప్పుడు పేర్ల పరిశీలన జరుగుతోంది. అందులో అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. అనుష్క అంతకుముందు చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. అంతే కాకుండా ఇటీవల వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో అనుష్క ఒక ముఖ్య పాత్రలో నటించారు. కానీ చిరంజీవి, అనుష్క కలిసి ఒక సినిమా చేయలేదు. ఇప్పుడు ఈ సినిమా చేస్తే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మొదటి సినిమా ఇదే అవుతుంది.

ALSO READ : హాయ్ నాన్న సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?


End of Article

You may also like