Bholaa Review : బాలీవుడ్ హీరో “అజయ్ దేవగన్” నటించి, దర్శకత్వం వహించిన రీమేక్ సినిమా భోలా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Bholaa Review : బాలీవుడ్ హీరో “అజయ్ దేవగన్” నటించి, దర్శకత్వం వహించిన రీమేక్ సినిమా భోలా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : భోలా (కార్తీ ఖైదీ రీమేక్)
  • నటీనటులు : అజయ్ దేవగన్, టబు, వినీత్ కుమార్, దీపక్ డోబ్రియాల్, గజరాజ్ రావ్, సంజయ్ మిశ్రా.
  • నిర్మాత : అజయ్ దేవగన్
  • దర్శకత్వం : అజయ్ దేవగన్
  • సంగీతం : రవి బస్రూర్
  • విడుదల తేదీ : మార్చ్ 30, 2023

bholaa movie review

Video Advertisement

స్టోరీ :

సినిమా మొత్తం భోలా (అజయ్ దేవగన్) అనే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఒక కారణం వల్లన జైలుకి వెళ్ళిన భోలా 10 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. తనకి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురిని కలుసుకోవాలి అని వెళ్ళాలి అనుకుంటాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఏసిపి డయానా జోసెఫ్ (టబు) కి సంబంధించి ఒక సమస్యని భోలా పరిష్కరించాల్సి ఉంటుంది. అసలు ఆ సమస్య ఏంటి? అప్పుడు భోలా ఏం చేశాడు? అక్కడ భోలాకి ఎదురైన సంఘటనలు ఏంటి? తన కూతురిని కలుసుకున్నాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

bholaa movie review

రివ్యూ :

ఏదైనా ఒక సినిమా ఒక భాషలో పెద్ద హిట్ అయితే ఆ సినిమాని వేరే భాషలోకి రీమేక్ చేయడం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉండే విషయం. అలా చాలా సినిమాలు మన భాషలో రీమేక్ అయ్యాయి. మన సినిమాలు ఎన్నో వేరే భాషలో రీమేక్ అయ్యాయి. కార్తీ అంటే తమిళ్ హీరో అని కాకుండా తెలుగు హీరో అని ప్రేక్షకులు అనుకుంటారు. అందుకే కార్తీ నటించిన సినిమాలు అన్నీ కూడా తెలుగులో విడుదల అవుతాయి. అలాగే కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తెలుగులో విడుదల అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది.

bholaa movie review

కార్తీ లాంటి ఒక పెద్ద స్టార్ హీరో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయం అని అప్పట్లో చాలా మంది అన్నారు. ఈ సినిమాని ఇప్పుడు హిందీలో స్టార్ హీరో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు. ఈ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా, ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. సినిమా స్టోరీ లైన్ దాదాపు ఒరిజినల్ లాగానే ఉంటుంది. కానీ సినిమాలో చాలా మార్పులు చేశారు. ఒరిజినల్ సినిమాలో హీరోయిన్ లేరు. కేవలం తన భార్య గురించి ఢిల్లీ చెప్తాడు.

bholaa movie review

కానీ హిందీలో మాత్రం అజయ్ దేవగన్ పక్కన అమలా పాల్ హీరోయిన్ గా నటించారు. అలాగే ఒరిజినల్ లో పోలీస్ గా మగవారు ఉంటారు. కానీ హిందీలో మాత్రం పోలీస్ పాత్రలో టబు నటించారు. అసలు ఒరిజినల్ హిట్ అవ్వడానికి మరొక ముఖ్య కారణం పాటలు లేకపోవడం. సినిమా మధ్యలో ఒక్క పాట ఉన్నా కూడా సినిమా డిస్టర్బ్ అవుతుంది. కానీ హిందీలో మాత్రం పాటలు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిచోట్ల కేజిఎఫ్ సినిమాని గుర్తు చేసేలాగా ఉంటుంది.

bholaa movie review

అందుకు కారణం కేజిఎఫ్ సినిమాకి సంగీత దర్శకత్వం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకి కూడా సంగీతం అందించారు. అసలు సినిమా చూస్తున్నంత సేపు ఒక సినిమా రీమేక్ లాగా అనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ విషయం ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది కానీ ఖైదీ సినిమాని బాగా ఇష్టపడిన ప్రేక్షకులకు మాత్రం, “ఏంటిది ఇక్కడ ఇలా చేశారు?” అని అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • కథ
  • నిర్మాణ విలువలు
  • కొన్ని యాక్షన్ సీన్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • కొన్ని మార్పులు
  • పాటలు

రేటింగ్ :

3.25 / 5

ట్యాగ్ లైన్ :

ఒరిజినల్ ఖైది తమిళ్ సినిమా అయినా కూడా తెలుగులో చాలా పెద్ద హిట్ అయ్యింది. అందుకే ఈ సినిమాకి తమిళ్ తో పాటు, తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. దాంతో రీమేక్ లో ఉన్న మార్పులు నిరాశపరిచే అవకాశం ఉంది. ఒక రీమేక్ సినిమాని చూస్తున్నాం అనుకోకుండా చూస్తే భోలా సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like