• చిత్రం : తెగింపు
 • నటీనటులు : అజిత్ కుమార్, మంజు వారియర్, సముద్రఖని, జాన్ కొక్కెన్, వీర, బక్స్.
 • నిర్మాత : జీ స్టూడియోస్, బోనీ కపూర్
 • దర్శకత్వం : హెచ్ వినోద్
 • సంగీతం : జిబ్రాన్
 • విడుదల తేదీ : జనవరి 11, 2023

tegimpu movie review

Video Advertisement

స్టోరీ :

చెన్నైలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో దోపిడీ బృందం దిగి దొంగతనం చేయాలని అనుకుంటారు. వారు దొంగతనం చేసి వెళ్లిపోతున్న సమయంలో డార్క్ డెవిల్ (అజిత్ కుమార్) కూడా బ్యాంక్‌లో కనిపిస్తాడు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే ఎన్నో మోసాలని బయటికి తీసుకురావడమే అతని ధ్యేయం. అతను ఎవరు? తను అనుకున్న దాంట్లో విజయం సాధించాడా..? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

tegimpu movie review

రివ్యూ :

హీరో అజిత్ కి ఒక మంచి హిట్ పడి చాలా రోజులు అయ్యింది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలని ప్రేక్షకులకు అందించడంలో అజిత్ ముందు ఉంటారు. హీరో అంటే కేవలం హీరోఇజం చేయడం మాత్రమే కాదు అన్ని రకాల ఎమోషన్స్ చేయాలి అని అనుకుంటారు. ఇప్పుడు తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

tegimpu movie review

సినిమా మొత్తం ఒక బ్యాంక్ చుట్టూ తిరుగుతుంది. సినిమాలో చాలా తక్కువ మందిని నటి నటులు ఉంటారు. కానీ ఉన్న వాళ్ళు అందరూ కూడా సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటారు. అసలు అజిత్ కాకుండా ఈ సినిమా ఇంకా ఎవరైనా చేస్తే చూడలేము ఏమో అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత అజిత్ చాలా యాక్టివ్ గా కనిపించారు. ఇంత పెద్ద స్టార్ అయ్యాక ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమా చేయడం ఒక రకంగా సాహసం అని చెప్పాలి.

tegimpu movie review

కానీ అజిత్ అలాంటి రిస్క్ తీసుకోవడం చాలా అభినందించాల్సిన విషయం. అజిత్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో మరొక పాత్రలో నటించిన మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ కూడా చాలా బాగా నటించారు. సినిమాకి మరొక హైలైట్ మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్. అవి చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే జిబ్రాన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. సినిమాని మరొక లెవెల్ కి తీసుకువెళ్లాయి. సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం శంకర్ సినిమాల్లో ఉన్నట్టుగా మెసేజ్ ఓరియంటెడ్ గా ఉన్నట్టు అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

 • అజిత్
 • యాక్షన్ సీన్స్
 • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
 • కాన్సెప్ట్

మైనస్ పాయింట్స్:

 • సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్
 • బోరింగ్ గా అనిపించే కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా చూడాలి అని అనుకునే వారికి తెగింపు ఒక మంచి యాక్షన్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :