Ads
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘వేదాళం’. ఈ చిత్రం లో లక్ష్మి మీనన్, శృతి హాసన్ హీరోయిన్ లుగా నటించగా.. అశ్విన్ కాకుమాను, రాహుల్ దేవ్, తంబి రామయ్య, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.
Video Advertisement
ఒక మాజీ సైనికుడు తన సోదరిని క్రిమినల్ సిండికేట్ నుంచి ఎలా కాపాడుకున్నాడు అనేదే ఇందులో మెయిన్ పాయింట్.
2015 లో విడుదల అయిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ 120–125.7 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఎడిటింగ్ వెట్రి, రూబెన్ చేసారు. అయితే ఈ చిత్రం విడుదలైన 7 సంవత్సరాలకి దీని ట్రైలర్ ని విడుదల చేసారు ఎడిటర్ రూబెన్. దీంతో అజిత్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు.
మరోవైపు ఈ చిత్రం బెంగాలీ లో 2018 లో రీమేక్ చేసి విడుదల చేసారు. ఇప్పుడు తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్నారు చిరంజీవి. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు గా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమాలో చిరుకి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా, మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
GlorytoGod 😇🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
As promised to the beloved fans of our #Ajith sir & To celebrate the 7th release Anniversary of #Vedalam ,here s my Trailer Cut.#7yearsofVedalam#VedalamTrailer #SivaandTeam@directorsiva @anirudhofficial @vetrivisuals pic.twitter.com/T3GzJ8GIt5
— Editor Ruben (@AntonyLRuben) November 9, 2022
End of Article