చిన్నది దొరకాలే కానీ సోషల్ మీడియాలో గట్టిగ ఆడేసుకుంటూ వుంటారు. పెద్ద ఎత్తున మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చాయంటే మరి షేర్ చెయ్యకుండా వుంటారా..? ఒక రేంజ్ లో ఇలాంటి మీమ్స్ ని షేర్ చేసేస్తూ ఉంటారు. అయితే తాజాగా జగపతి బాబు మీద ఒక మీమ్ రాగా.. ఆ మీమ్ వైరల్ గా మారింది.

Video Advertisement

జగపతి బాబు ట్రైనింగ్ ఇచ్చిన సినిమాలు మరియు పాత్రలకు సంబంధించి ఈ మీమ్ లో వుంది. సాయి ధరమ్ తేజ్ కి విన్నర్ సినిమా లో హార్స్ రైడింగ్ కోసం జగపతి బాబు ట్రైనింగ్ ఇచ్చాడు.

అయితే ట్రైనింగ్ ఇచ్చాడు సినిమా అస్సాం పోయింది. అలానే కీర్తి సురేష్ కి జగపతి బాబు గుడ్ లక్ సఖి లో షూటింగ్ ట్రైనింగ్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కూడ హిట్ అవ్వలేదు. అదే విధంగా ఆర్చరీ ట్రైనింగ్ ని జగపతి బాబు నాగ శౌర్య కి లక్ష్య సినిమాలో ఇవ్వగా.. ఆ సినిమా కూడ హిట్ కాలేదు.

ఇక శర్వానంద్ కి అయితే స్మగ్లింగ్ ట్రైనింగ్ ఇచ్చాడు జ్జగపతి బాబు. కానీ అది కూడ హిట్ అవ్వలేదు. ఇలా వీటన్నిటినీ కవర్ చేస్తూ మీమ్ వచ్చింది. అయితే అఖండ సినిమాలో బాలకృష్ణని మాత్రం అఘోర దగ్గర ట్రైనింగ్ కి పంపాడు కాని జగపతిబాబు ట్రైనింగ్ ఇవ్వలేదు. అందుకే బాలకృష్ణ సేఫ్ గా ఉన్నాడని.. లేదంటే ఆ సినిమా కూడ పోయేదని మీమ్ వచ్చింది. జగపతి బాబు కనుక బాలయ్య బాబుకి ట్రైనింగ్ ఇస్తే ఆ సినిమా కూడ హిట్ అయ్యేది కాదు అని ఆ మీమ్ లో వుంది.