అక్కినేని నట వారసుడు అఖిల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి సక్సెస్ అయిన సినిమాలకంటే ఫ్లాప్ అయిన మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయన ఈ సారైనా బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు.

Video Advertisement

ఈ సినిమా హిట్టయితే గాని అతని సినీ జీవితం గాడిలో పడదు. ప్రస్తుతం అఖిల్ “ఏజెంట్” అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీనికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఎలాగైనా 100 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఈ తరుణంలోనే తాజాగా ఏజెంట్ మూవీ నుండి అఖిల్ ఫస్ట్ లుక్ విడుదల కాగా నెటిజన్లు కొన్ని నెగిటివ్ కామెంట్లు తీసుకువస్తున్నారు. ఈ లుక్ కాపీ అని , ఈ పోస్టర్ ను చూస్తుంటే గేమ్ ఆఫ్ త్రోన్స్ హీరో గుర్తుకు వస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.

జోన్ స్నోనీ హీరోనీ అఖిల్ కాపీ కొట్టారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ “ఏజెంట్” కాపీ మరక గురించి దర్శకుడు ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిందే. కానీ అఖిల్ ఈ మూవీలో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే సినిమా బ్లాక్ బ్లాస్టర్ టాక్ వస్తే మాత్రమే కమర్షియల్ గా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య నడుస్తుండగా, మమ్ముట్టి మలయాళ నటుడు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది అని, దీనికోసం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోందని సమాచారం.