అఖిల్ అక్కినేని సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అయ్యింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అఖిల్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చాలా క్రేజ్ వచ్చింది. అందుకు కారణం ఈ సినిమాలో అఖిల్ లుక్. ఒక సమయంలో అఖిల్ అన్ని చాలా రొటీన్ సినిమాలు చేస్తున్నారు. లుక్ కూడా పెద్దగా మారలేదు అని అన్నారు.

Video Advertisement

కానీ ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడి తన లుక్ కూడా మార్చారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. అయితే అఖిల్ అంతకుముందు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారు. కానీ ఈ మధ్య ఏదో ఒక సందర్భం ఉంటే తప్ప సోషల్ మీడియాలో పెద్దగా పోస్ట్ చేయట్లేదు. అలాంటిది అఖిల్ ఇవాళ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

6 akhil

అందులో అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడారు. ఆ పోస్ట్ లో అఖిల్, “నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం” అని రాశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

akhil akkineni post about akkineni nageswara rao and ntr

ఈ పోస్ట్ అసలు ఎవరి గురించి రాశారు అని అందరూ అంటున్నారు. కానీ ఇటీవల బాలకృష్ణ ఒక ఈవెంట్ లో మాట్లాడిన కామెంట్స్ కి అఖిల్ ఇలా అన్నారు అని అంటున్నారు. ఆ కామెంట్స్ కూడా ఆ తర్వాత చర్చల్లో నిలిచాయి. దాంతో ఇప్పుడు అఖిల్ ఇలా పోస్ట్ చేయడం వెనక అర్థం ఇదే అని అంటున్నారు. ఇంక సినిమాల విషయానికి వస్తే అఖిల్ ఏజెంట్ తర్వాత ఏం సినిమా చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఎప్పుడో విడుదల కావాల్సిన ఏజెంట్ చాలా కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఈ విషయంపై ఎంతో మంది ఎన్నో రకాలుగా అన్నారు. అసలు కొంత మంది ఈ సినిమా ఉంది అని కూడా మర్చిపోయాం అని అంటున్నారు. కానీ ఏదేమైనా సరే అవసరమైనంత సమయం తీసుకొని, సినిమాలో ఏమైనా మార్పులు చేసేది ఉంటే చేసి, ఒక మంచి యాక్షన్ సినిమాగా విడుదల చేయడం సరైన నిర్ణయం అని చాలా మంది అంటున్నారు.