గత కొంతకాలం క్రితం వరకు ఎక్కడ చూసినా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి చేశారు. షో అయిపోయిన తర్వాత దాదాపు ప్రతి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో, అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలాగే వాళ్ల సొంత యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

akhil and monal in bb utsavam

ఇంక అసలు షో టెలికాస్ట్ అయిన స్టార్ మాలో ఏదైనా ఈవెంట్ అయితే కంటెస్టెంట్స్ రాకుండా ఉండటం అనేది జరగని పని. ఇటీవల సంక్రాంతి సందర్భంగా జరిగిన ఈవెంట్ లో సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మళ్లీ బిగ్ బాస్ ఉత్సవం ద్వారా అందరిని ఎంటర్టైన్ చేశారు. ఇందులో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ వచ్చారు.

akhil and monal in bb utsavam

ఈ ప్రోగ్రాం కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించారు. ఈ ప్రోగ్రాం లో అవినాష్, అరియానా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే మోనాల్ తాను ఎక్కడికి వెళ్లినా కూడా ఒక జాకెట్ వేసుకుంటారు అని. ఎందుకంటే అది బిగ్ బాస్ లో తనకి గిఫ్ట్ గా వచ్చింది అని చెప్పారు. అఖిల్ కూడా మోనాల్ బయటికి వెళ్ళినా, ఎయిర్ పోర్ట్ లో కూడా, లేదా ఇంక ఎక్కడికి వెళ్ళినా కూడా అదే జాకెట్ వేసుకుంటారు అని అన్నారు. అలాగే అఖిల్ మోనాల్ కి పట్టీలు గిఫ్ట్ గా ఇచ్చారు. అంతే కాకుండా ఆ పట్టీలని మోనాల్ కాలికి తొడిగారు.

akhil and monal in bb utsavam

అందుకు శ్రీముఖి, ఇప్పటి నుంచి జాకెట్ మాత్రమే కాదు ఎయిర్ పోర్ట్ లో కాలి పట్టీలు కూడా చెక్ చేయండి కంపల్సరీగా ఉంటాయి అని సరదాగా జవాబిచ్చారు. సోహెల్ కూడా జాకెట్ తో పాటు పట్టీలు కూడా ఇంక లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతాయి అని అన్నారు. ఇంక ఈవెంట్ విషయానికొస్తే అందరు కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ షో గురించి సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ చూపించారు, దాంతో పాటు అందరికీ ఒక్కొక్క టైటిల్ ఇచ్చి ట్రోఫీ ఇచ్చారు.


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE