Ads
పవర్ స్టార్, రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా నందన్ కు సోషల్ మీడియాలో పవన్ తనయుడిగా గట్టి ఫాలోయింగ్ ఉంది. పవన్, ఆయన తనయుడు అకిరా ఒక ఫ్రేమ్ లో కనిపించారంటే చాలు ఫాన్స్ కూడా పండగ చేసుకుంటారు. అందులోను అకిరా పవన్, రేణు దేశాయ్ ల అందం కలబోసుకుని మరీ పుట్టాడు.
Video Advertisement
లేటెస్ట్ గా, నెట్టింట్లో ఓ ఫోటో వైరల్ అవుతోంది. పవన్, అకీరా లు కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో లో అకీరా పవన్ ను మించిన హైట్ తో కనిపిస్తున్నాడు. మాములుగా.. ఏ మెగా ఫామిలీ ఫంక్షన్ లో అయినా అకిరా తన హైట్ కారణం గా ఫ్రేమ్ లో హైలైట్ అవుతూ ఉంటాడు. తాజాగా.. ఈ పిక్ లో కూడా తన హైట్ తో హైలైట్ అయ్యాడు. అకీరా నందన్ కూడా సినిమాలలోకి వస్తాడని టాక్ వినిపిస్తోంది కానీ, ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. మరి అకిరా కెరీర్ విషయమై రేణు దేశాయ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
End of Article