కరోనా ఐసోలేషన్ వార్డ్ నుండి కొందరు ఎందుకు పారిపోతున్నారో తెలుసా? అసలు కారణం ఇదే..!

కరోనా ఐసోలేషన్ వార్డ్ నుండి కొందరు ఎందుకు పారిపోతున్నారో తెలుసా? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

హాస్పటల్స్ నుండి కరోనా పేషెంట్స్ పారిపోతున్నారు. మీరు చదివింది నిజమే. భయపడినంతా జరుగుతుంది. ఏ వ్యాధినైనా వ్యాప్తి చెందకుండా చూడడమే ప్రధమ కర్తవ్యం . ఒక్కసారిగా వ్యాధి ప్రభలితే పరిస్థితులు మన చేయి దాటి పోతాయి. ఇప్పటికే ఇటలీ,స్పెయిన్ లాంటి దేశాలు చేతులెత్తేశాయి. మన దేశంలో పరిస్థితి ఇంకా మన చేతుల్లోనే ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంతకీ హాస్పిటల్స్ నుండి కరోనా పేషెంట్స్ పారిపోవడానికి గల రీజన్స్ ఏంటో తెలుసా?

Video Advertisement

ప్రపంచ దేశాలన్ని ఏకధాటిపైకి వచ్చి కరోనాపై ఫైట్ చేస్తున్నారు. ఇప్పటివరకు కరోనాకి వాక్సిన్ కనుక్కోని కారణంగా వ్యాధి నివారణకు ఏఏ దేశాలు ఏ మందులు వాడుతున్నారు, ఏ మందులకి కరోనా నయం అవుతుందనే సమాచారాన్న అంతర్జాతియంగా ఆయా దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నరు. మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడిక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు . అయితే ఇప్పటికే నమోదైన కరోనా కేసుల సంఖ్య సుమారు వందపైనే, వీటిలో రెండు మరణాలు. అయితే ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది.

ఎక్కడ కరోనా ఇతరులకు సోకుతుందో అని కరోనా పేషెంట్స్ ని ఐసోలేషన్లో ఉంచుతున్నారు. అక్కడ ఒంటరిగా నిర్భందించడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక కొందరు హాస్పటల్స్ నుండి పారిపోతున్నరు. దేశ రాజదాని ఢిల్లీ నుండి మొదలు పెడితే, కేరళలోని అళప్పుళ, కడప, జగిత్యాల ఇలా ప్రతిచోట ఇదే పరిస్థితి. ఐతే కరోనా రోగులు పారిపోవడం వెనుక ఒక్కో చోట ఒక్కో కారణాలు కనపడుతున్నాయి.

మహారాష్ట్రలోని నాగపూర్ లో కరోనా వైరస్ లక్షణాలతో నలుగురు వ్యక్తుల్ని డాక్టర్లు హాస్పటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అయతే ఈ నలుగురు డాక్లర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే హాస్పటల్ నుండి వెళ్లిపోయారు. దీంతో కరోనా ఇతరులకు సోకుతుందేమోని భయంతో డాక్టర్లు పోలీసులకి సమాచారం ఇచ్చారు. కరోనా బాదితులందరికి ఒకే టాయిలెట్ ఏర్పాటు చేయడంతో, ఎక్కడ సమస్య మరింత ఎక్కువవుతుందో అనే భయంతో పారిపోయామని వారు పోలీసులకు చెప్పారు.నాగపూర్ లోఇప్పటికి పది కేసులు నమోదవగా మూడు పాజిటివ్ వచ్చాయి.

మరికొంతమంది కరోనా పాజిటివ్ అని వస్తే ఎక్కడ తమ కుటుంబసభ్యులు దూరం అవుతారో, లేదంటే చుట్టుపక్కల వాళ్లు దాడి చేస్తారో అనే భయంతో పారిపోతున్నారు. ఇప్పటివరకు మందు కనుగొనకపోవడంతో, ఎక్కడ తమ పైనే పరీక్షలు చేస్తారో అనే భయం కొంతమందిని పారిపోయేలా చేస్తోంది.

అగ్రాలోని ఐసోలేషన్ వార్డుల్లో టాయిలెట్ల పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందో చూడమంటూ ముంబైకి చెందిన అంకిత్ గుప్తా  సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నగరంలోని కస్తూర్భా హాస్పిటల్లో కనీసం శానిటరీలు అందుబాటులో లేవని ఆరోపించారు. గుప్తా స్నేహితుడు ఒకరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.నవ్యా దువా  కూడా ఢిల్లీలోని ఐసోలేషన్ వార్డులో శానిటేషన్ అందుబాటులో లేదని ఆరోపించారు. భారత్ లో చాలామందికి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ పై నమ్మకం లేదు. అందుకే సాధ్యమైనంత వరకు పబ్లిక్ సిస్టమ్ లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంగుళూరు హాస్పటల్ నుండి ఒక వ్యక్తి పారిపోయాడు . అతన్ని పట్టుకున్న పోలీసులకు అతడు చెప్పిన సమాధానం మెరుగైన ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తున్నా అని చెప్పాడు.కేరళలోని అళప్పులలోని మెడికల్ కాలేజి నుండి ఇద్దరు విధేశీయులు పారిపోయారు. వీళ్లను పోలీసులు ఎయిర్పోర్ట్ లోఅదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎర్నాకుళం హాస్పటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.

హస్పటల్స్ లో సౌకర్యాలు లేకపోవడమే ప్రధాన కారణంగా కనపడుతోంది . పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు మరింత దారుణంగా మారొచ్చు. అంతవరకు వెళ్లకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత అవసరం. కొద్ది రోజుల పాటు జనసమూహా ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు సమస్యను అధిగమించినవారమవుతాం.

Also watch:


End of Article

You may also like