అక్కడికి అబ్బాయిలు వెళ్లారంటే ఇక అంతే….కిడ్నప్ చేసి పెళ్లి చేసేస్తారంట.?

అక్కడికి అబ్బాయిలు వెళ్లారంటే ఇక అంతే….కిడ్నప్ చేసి పెళ్లి చేసేస్తారంట.?

by Mohana Priya

మామూలుగా మనుషుల్ని కిడ్నాప్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి వాళ్ల ఇంట్లో వాళ్లని బెదిరించి డబ్బులు తీసుకొని కిడ్నాప్ చేసిన వ్యక్తిని వదిలేస్తారు. ఇలా చాలా మంది కిడ్నాప్ చేయడానికి గల కారణం డబ్బు. మనుషులని కిడ్నాప్ చేసి పెళ్లిళ్లు చేయించడం ఎప్పుడైనా విన్నారా? ఖచ్చితంగా విని ఉండరు. కానీ ఇలా నిజంగానే జరుగుతోంది.

Video Advertisement

 

బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలా మనుషులని కిడ్నాప్ చేసి పెళ్లి చేయిస్తున్నారు. ఒప్పుకోకపోతే తుపాకీ చూపించి బెదిరిస్తున్నారు. కిడ్నాప్ అయిన వాళ్లలో దాదాపు అందరూ మగవాళ్లే. ప్రతి సంవత్సరం ఇలా బలవంతంగా పెళ్లిళ్లు జరిగిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2014లో 2,526, 2015 లో 3,000, 2016లో 3,070, 2017 లో 3,678, 2018 లో 4,301,  2019 లో 4,317 మందికి బలవంతంగా పెళ్ళిళ్ళు చేశారు.

 

బలవంతంగా కిడ్నాప్ చేసి పెళ్లిళ్ళు చేయడాన్ని పకరువా (పకడ్వా) వివాహ్ అంటారు. కూతురు ఉండి, కట్నం భరించలేని వాళ్లు ఇలా చదువుకుని ఉద్యోగం లో ఉన్న అబ్బాయిలు కనిపిస్తే వారిని బెదిరించి తీసుకొచ్చి వాళ్ళ ఊరి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అలా బెదిరించబడిన ఎంతో మంది అబ్బాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

ఈ సంవత్సరం జనవరిలో దాదాపు 270 మంది కి ఇలా పెళ్లిళ్లు అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో కూడా హాజీపూర్ లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక హాస్పిటల్ దగ్గర ఒక అతనిని కిడ్నాప్ చేసి జీపు లో ఎక్కించి తీసుకెళ్లి పెళ్లి చేశారు. పెళ్ళి తతంగం అంతా అవ్వడానికి వారికి పట్టే సమయం పది నిమిషాలు. తన కొడుకుకి బలవంతంగా పెళ్లి చేశారు అని కిడ్నాప్ అయిన అబ్బాయి వాళ్ళ తండ్రి కిడ్నాప్ చేసిన వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.


You may also like