నాగార్జునపై విపరీతమైన అభిమానంతో ఈ అభిమాని ఎంత పని చేసాడో చూడండి..!

నాగార్జునపై విపరీతమైన అభిమానంతో ఈ అభిమాని ఎంత పని చేసాడో చూడండి..!

by Anudeep

Ads

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు తెలుగు నాట ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు, బిగ్ బాస్ రియాలిటీ షో హోస్టింగ్ తో బిజీ బిజీ గా ఉండే నాగార్జున గతేడాది బంగార్రాజు సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు.

Video Advertisement

మన్మథుడిగా తెలుగు ఇండస్ట్రీలో నాగార్జునకు తిరుగు లేని ఫ్యాన్ బేస్ ఉంది. అక్కినేని నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. లవర్ బాయ్ గా రాణించారు. ఆ తరువాత అన్నమయ్య, శ్రీ రామ దాసు వంటి భక్తి రసాత్మక చిత్రాలలో కూడా నటించి మెప్పించారు.

annamayya 2

ఇక యాక్షన్ సినిమాల్లో కూడా నాగార్జున తన సత్తా చాటారు. యాక్షన్, రొమాంటిక్, భక్తి.. ఇలా ప్రతి అంశంలోనూ నాగార్జున నటన విషయంలో తనదైన ముద్ర వేసి టాలీవుడ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక అభిమానుల విషయానికి వస్తే.. నాగార్జునకు ఆరుపదుల వయసు వస్తున్నా.. ఇప్పటికీ చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇటు మాస్ ఆడియన్స్, అటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను నాగార్జునకు చాలానే ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం.. నాగార్జునకు వీరాభిమాని అయిన ఓ వ్యక్తి చేసిన పని గురించి చెప్పుకుందాం.

annamayya 1

నాగార్జున అన్నమయ్యగా నటించిన సినిమా ఆయన కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా 1997 మే రెండవ తేదీన విడుదల అయ్యింది. ఈ క్రమంలో ఆ సినిమా విడుదల అయ్యాక.. ఓ అభిమాని అన్నమయ్య ఆలయాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. 1997 ఈ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందుకోసం సదరు అభిమాని ఏకంగా కోటి రూపాయలకు పైనే ఖర్చు చేశారట. కేవలం భక్తి చిత్రాలలో నటించారన్న అభిమానంతోనే సదరు వ్యక్తి ఇలా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


End of Article

You may also like