తెలుగు చిత్రసీమలో అక్కినేని నాగేశ్వరరావు పేరు తెలియని వారు ఉండరు. అందరు ప్రేమగా ANR అని పిలుస్తారు. ఆయన తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 255 చిత్రాల్లో నటించారు.

Video Advertisement

అక్కినేని నాగేశ్వరరావు మధ్యతరగతి కుటుంబంలో 20 సెప్టెంబర్ 1923లో జన్మించారు. 10 సంవత్సరాల వయస్సులోనే థియేటర్ లో నటించటం మొదలు పెట్టారు. ఆ కాలంలో మహిళలు నటించడం నిషేధంలో ఉండేది. దాని వల్ల నాగేశ్వరరావు అమ్మాయిల పాత్రల్లో నటించేవారు. 17 ఏళ్ల వయస్సులో 1941లో తొలి సినిమా చేసాడు. ఆ సినిమా పేరు ధర్మపత్ని, ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ గా నటించారు.  నాగేశ్వరరావు గారు ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉండగా అక్కడ ప్రముఖ సినీ నిర్మాత ఘంటసాల బలరామయ్య చూసి సినిమా అవకాశం ఇచ్చారు. Akkineni-Nageswara-Rao-3-telugu-adda.jpg.1949వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు 18 ఫిబ్రవరిన అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. అయితే నాగేశ్వరరావు తన వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో తాజాగా సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ జంట తమ 78 సంవత్సరాల ప్రయాణంలో భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో తమ వైవాహిక జీవితం ద్వారా చూపించారు. వీరికి ఐదుగురు పిల్లలు నాగార్జున, వెంకట్ రత్నం, సరోజ, సత్యవతి, నాగ సుశీల.
Akkineni-Nageswara-Rao-2-telugu-adda.jpg.అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. మాయాబజార్, బ్రతుకు వీధి, సంసారం, ఆరాధన, దొంగ రాముడు, అర్ధాంగి, డాక్టర్ చక్రవర్తి, ఇల్లరికం, మాంగల్య బలం, శాంతినివాసం, భార్య భర్తలు, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, బాటసారి, ధర్మదాత, కాలేజీ బుల్లోడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ ను తెలుగు సినిపరిశ్రమకి అందించారు1970ల లో తెలుగు సినిమా పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకు రావటంలో ముఖ్య పాత్రను పోషించారు. 1976వ సంవత్సరంలో తన భార్య పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి తెలుగు సినిమాకు మౌలిక సదుపాయాలను అందించారు. అక్కినేని నాగేశ్వరరావుతెలుగు సినిమా పై తనదైన ముద్రను వేశారు.