టాలీవుడ్ లో లేటెస్ట్ గా సమంతా నాగ చైతన్య ల మీద వస్తున్న రూమర్స్ అందరికి తెలిసిందే. రోజుకు ఒకసారైనా ఎక్కడో ఒక చోట వీరి పైన న్యూస్ వస్తూనే ఉంది. కానీ ఇలాంటి వార్తల పైన అటు సమంతా లేదా నాగ చైతన్య ఇరువురిలో ఎవరు కూడా ఖండించడం లేదు. గతంలో ఇలాంటి రూమర్స్ పైన స్పందిస్తూ సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేసే సమంతా ఇప్పుడు మాత్రం కామ్ గా ఉన్నారు.

Video Advertisement

samantha

samantha

ఇటీవలే నాగ చైతన్య కూడా ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్స్ లో ఇలాంటి వార్తల ప్రస్తావన లేకుంటేనే ఇంటర్వ్యూ లు ఇస్తానంటూ షరతులు విధించారు. సమంతా ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అయితే భర్త నాగ చైతన్య లేకుండా ఇదే మొదటి సారి తిరుమలకి రావడం. దర్శనానంతరం ఒక విలేఖరి ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఉండగా ‘గుడికి వచ్చి బుద్ది ఉందా ?’ అంటూ ఘాటుగా స్పందించారు.

samantha akkineni

samantha akkineni

ఇక తిరుమల లో తన టీం తో స్టేటస్ పోస్ట్ చేసిన సమంతా ఎప్పటికీ కలిసి ఉండే సభ్యులం అంటూ కాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేసారు సమంతా. నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా ఈ వారమే ప్రేక్షకుల మందికి రానుంది. సమంతా గుణ శేఖర్ ల ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుకుంది.