హెబ్బా పటేల్ నటించిన ఈ కొత్త సినిమా చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?

హెబ్బా పటేల్ నటించిన ఈ కొత్త సినిమా చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?

by Mounika Singaluri

ప్లే బ్యాక్, మెరిసే మెరిసే చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘దినేష్ తేజ్’. ఈ ఏడాది ‘అలా నిన్ను చేరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో మారేష్ శివన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.

Video Advertisement

పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీగా తెరకేకిన ఈ సినిమా స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ala ninnu cheri movie reviewఈ సినిమాలో దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయి సుధాకర్ విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నిర్మించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, గ‌ణేష్‌ (దినేష్ తేజ్‌) విశాఖ‌ప‌ట్నం దగ్గరలో ఉన్న ప‌ల్లెటూరికి చెందిన మిడిల్ క్లాస్ యువకుడు. అతనికి సినిమాలంటే పిచ్చి. ఎప్పటి కైనా దర్శకుడు కావాల‌ని క‌ల‌లు కంటుంటాడు. గ‌ణేష్‌ జీవితంలోకి ఆ ఊరి అమ్మాయి దివ్య‌ (పాయ‌ల్ రాధాకృష్ణ‌) ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరు ప్రేమ‌లో ప‌డ‌తారు.
ala ninnu cheri movie reviewకానీ వారి లవ్ కు దివ్య అమ్మ క‌న‌క‌మ్మ (ఝాన్సీ) అడ్డుగా నిలుస్తుంది. ఆమె అప్పటికే దివ్య‌కు కాళీ (శ‌త్రు) తో పెళ్లి చేయాల‌ని ఫిక్స్ అవుతుంది. విషయం తెలిసిన దివ్య, గ‌ణేష్‌ దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి చెప్పి ఎలాగైనా ఆపమని కోరుతుంది. కానీ దర్శకుడు కావాలనుకున్న గ‌ణేష్ కు ఏం చేయాలో అర్ధం కాదు. పెళ్లి కన్నా కెరీర్ ముఖ్య‌మ‌ని సినిమా ఛాన్స్ కోసం హైద‌రాబాద్ వెళ‌తాడు.

ala ninnu cheri movie review

ఆ త‌ర్వాత గ‌ణేష్ లైఫ్ లోకి అను (హెబ్బాప‌టేల్‌) ఎలా వ‌స్తుంది? అను ఎవ‌రు? దర్శకుడు కావాల‌నుకున్న గ‌ణేష్ క‌ల తీరిందా? దివ్య పెళ్లి కాళీతో జ‌రిగిందా అనేది మిగిలిన కథ. లవ్ కు, ల‌క్ష్యానికి మ‌ధ్య నలిగిపోయే యువ‌కుడి స్టోరీనే ఈ చిత్రం. ద‌ర్శ‌కుడు మారేష్ శివ‌న్ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించాడు.


You may also like

Leave a Comment