ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సంచలనమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు ఈ అపరకుబేరుడు. తాజాగా ఆయన ట్విట్టర్ ను కూడా కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అతను ఎవరో అనుకుంటున్నారా వరల్డ్ నెంబర్ వన్ కుబేరుడు ఎలాన్ మస్క్.

Video Advertisement

ప్రస్తుతం ఈయన కన్ను ఇండియాపై పడింది. ఇండియాలోని ప్రేమకు చిహ్నంగా ఉన్న తాజ్ మహల్ మరియు ఆగ్రా కోట నిర్మాణాలను కొనియాడారు. ఇవి నిజంగా ప్రపంచ వింతలు అని అన్నారు.

 

అయితే 70 ఏళ్ల కిందటే ఎలాన్ మస్క్ అమ్మమ్మ తాతయ్యలు వీటిని సందర్శించారని చెప్పారు. అయితే ఆయన 2007 లో ఇండియా పర్యటనలో భాగంగా తాజ్ మహల్ సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఎర్ర కోట నిర్మాణం గురించి కొనియాడారు. చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది అని అన్నారు. ఆగ్రా ఒక భాగాన్ని చూపుతూ ఒక ట్వీట్ పై ఎలాన్ మస్క్ స్పందించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని బట్టి చూస్తే టెస్లా అధినేత మరోసారి ఇండియా పర్యటనపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అయితే ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ పై తన తల్లి మాయో మాస్క్ స్పందించారు. ఎలాన్ మస్క్ అమ్మమ్మ, తాతలు కూడా 1954 లో తాజ్ మహల్ సందర్శించారని వెల్లడించారు. వారు ఆ సమయంలో దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వెళుతున్న సందర్భంగా తాజ్ మహల్ కూడా సందర్శించినట్టు చాలా ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

వారు ఆ టైంలో జిపిఎస్ లేకుండా సింగిల్ ఇంజన్ ప్రొపెళ్లరు విమానంలో ఈ యాత్రను పూర్తి చేశారని మాయో మాస్క్ అన్నారు. అలాగే వారు తాజ్ మహల్ దగ్గర దిగిన ఫోటోలను షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఎలాన్ మాస్కు చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి. అసలు  మస్క్ తాజ్ మహల్ ఎందుకు గుర్తు చేసుకొని పొగిడారు.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటని.. నెటిజన్లు అనుకుంటున్నారు.!