చివరి శ్వాస వరకు నిన్నే ప్రేమిస్తుంటాను.. అలేఖ్యారెడ్డి పోస్ట్ వైరల్!

చివరి శ్వాస వరకు నిన్నే ప్రేమిస్తుంటాను.. అలేఖ్యారెడ్డి పోస్ట్ వైరల్!

by kavitha

Ads

నందమూరి తారకరత్న మరణించి రెండు నెలలు అవుతున్నా, ఆయన భార్య అలేఖ్యారెడ్డి ఇప్పటికి తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంది. భర్త జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతోంది.

Video Advertisement

తారకరత్న కన్నుమూసిన తర్వాత అలేఖ్యారెడ్డి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయన మరణం తర్వాత అలేఖ్య రెడ్డి సామాజిక మధ్యమాల్లో చేస్తున్న పోస్ట్ లు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో అలేఖ్యారెడ్డి తాజాగా  చేసిన పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ప్రేమ, పెళ్లితో తారకరత్న, అలేఖ్యారెడ్డి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇద్దరు కలిసి జీవించడం కోసం  అయిన వారందరికీ దూరమయ్యారు. హృదయంలోని భరించలేనంత బాధను చిరునవ్వుతో దాచేస్తూ ఇద్దరు కొత్త జీవితం మొదలుపెట్టారు. ఈ జంటకి ముగ్గురు పిల్లలు నిషిక, తాన్యారామ్, రేయా. తారకరత్న ఒక వైపు ఇండస్ట్రీలో  కొనసాగుతూ, మరో వైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తారకరత్న ఇప్పుడిప్పుడే తన కుటుంబానికి దగ్గర అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే అర్థంతరంగా కన్నుమూశారు.
నందమూరి తారకరత్న మరణించి రెండు నెలలకు పైగా అవుతుంది. యువగళం పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న, సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న కన్నుమూశారు. జీవితాంతం తోడుంటాడని భావించిన భర్త హఠాన్మరణంతో ఆయన భార్య అలేక్య రెడ్డి వేదన వర్ణణాతీతం. తన ముగ్గురు పిల్లల కోసం కన్నీళ్లను దిగమింగుకుంటూ జీవిస్తోంది. తన భర్తతో గడిపిన మధుర క్షణాలను తలచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో  తారకరత్నను తలచుకుంటూ “ఈ జీవితానికి సరిపడా మధురమైన జ్ఞాపకాలను ఇచ్చి వెళ్లావు. ఆ జ్ఞాపకాలతోనే ముందుకు వెళతాను. నా ఆఖరి శ్వాస వరకు కూడా నిన్నే ప్రేమిస్తుంటాను” అని రాసుకొచ్చారు. అలేఖ్యారెడ్డి మరో పోస్ట్ లో తన కుమారుడి ఫోటోతో పాటుగా తారకరత్న చిన్నప్పటి ఫోటోను కూడా షేర్ చేశారు. ఆమె చేసిన పోస్ట్ లను లైక్ చేస్తూ, ఆమెకు ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అలేఖ్యారెడ్డి తన పిల్లలను చూసుకుంటున్నారు. కెరీర్ విషయంలో ఆమె జాగ్రత్తగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తారకరత్న బిజినెస్ కు సంబంధించిన విషయాలను అలేఖ్యారెడ్డి చూస్తున్నారని  తెలుస్తోంది. అలేఖ్యారెడ్డి ఇటీవల సామాజిక మధ్యమాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఆమె ఏ పోస్ట్ పెట్టిన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతోంది.

https://www.instagram.com/p/CrLBBj_AII9/

Also Read: “పరశురాం పెట్ల సినిమా” తో పాటు… అనౌన్స్ చేశాక ఆగిపోయిన 6 “నాగ చైతన్య” సినిమాలు.!


End of Article

You may also like