ఆ హీరోయిన్ తో కమెడియన్ “ఆలీ” పెళ్లి ఫోటో చూసి… షాక్ అయిన ఆలీ భార్య..!!

ఆ హీరోయిన్ తో కమెడియన్ “ఆలీ” పెళ్లి ఫోటో చూసి… షాక్ అయిన ఆలీ భార్య..!!

by Sunku Sravan

Ads

తెలుగు చిత్రసీమలో ఆలీ పేరు చెప్తేనే మన మోముపై నవ్వు విరాజిల్లుతుంది. అతని ఫేస్ లో ఏదో తెలియని గమ్మత్తు, చూస్తేనే నవ్వొచ్చే ఒక మత్తు ఆలీ సొంతం. ఇప్పటికే ఆయన ఎన్నో సినిమాలు చేసి ప్రముఖ కమెడియన్ల లిస్టులో మంచి పేరును సంపాదించుకున్నారు.

Video Advertisement

కానీ ఆయన జీవితంలో కూడా ఒక సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది.. అది ఏంటో చూద్దాం..! అలనాటి ప్రముఖ హీరోయిన్ మాలశ్రీ చెల్లెలు శుభశ్రీ కూడా సినిమాల్లో కథానాయికగా రాణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె మలయాళ చిత్రాలతో పాటు తెలుగులో పెదరాయుడు ఊహ వంటి సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు.

ఆ నటి అసలు పేరు భారతీ పాండే. కానీ ఆమె పోషించిన శుభశ్రీ పాత్ర పాపులర్ అవ్వడంతో అసలు పేరుగా మారిపోయింది. తాజాగా ఈవిడ ఓ షోలో పాల్గొని పలు షాకింగ్ విషయాలు తెలిపింది. ఆమె చిన్నతనంలో పిల్లలతో ఆడుకునే సమయంలో ఒక అబ్బాయి వచ్చి తనకు సైట్ కొట్టేవాడని, అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా కూడా మారిందని పెళ్లి కూడా చేసుకున్నామని తన లవ్ స్టోరీని చెప్పింది. ఆ వ్యక్తి ఆమెకు మొదటిగా డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చాడని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

తాను స్కూల్ కి వెళ్లకుండా ఉండటం కోసమే సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా శుభశ్రీ మరియు ఆలీ అల్లరి పెళ్ళికొడుకు అనే సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీలో ఇద్దరికీ వివాహం జరుగుతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగానే, ఒక పెళ్లి ఫోటో బయటకు వచ్చేసింది. దీంతో ఒక మ్యాగజైన్ శుభశ్రీ  మరియు ఆలీకి పెళ్లి అయిపోయిందని ఒక కథనాన్ని ప్రచురించింది. అది చూసి నటువంటి ఆలీ భార్య షాక్కు గురైందని, ఈ సంఘటన చెప్పుకుంటూ శుభశ్రీ పడి పడి నవ్వింది.


End of Article

You may also like