ఇర్ఫాన్ ఖాన్ కి వచ్చిన ఆ రకం కాన్సర్ ఏంటి? దానిగురించి ఈ విషయాలు తెలుసా?

ఇర్ఫాన్ ఖాన్ కి వచ్చిన ఆ రకం కాన్సర్ ఏంటి? దానిగురించి ఈ విషయాలు తెలుసా?

by Anudeep

Ads

ఆయన విలక్షణ నటుడు.. డెస్టిని కూడా ఆయన జీవితాన్ని విలక్షణంగానే ట్రీట్ చేసింది.. ఒక విలక్షణమైన వ్యాధితో ఆ కళాకారుడి జీవితానికి అర్దాంతరంగా తెరవేసింది. ఇర్ఫాన్ ఖాన్ నటుడిగా తన జర్నీ తక్కువ కాలం అయినా కూడా చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు..అదే సమయంలో సామాజిక విషయాల్లోనూ తప్పుని తప్పుగా చెప్పగలిగే గట్స్ ని ప్రదర్శించి నటన పరంగానే కాదు, వ్యక్తిత్వ పరంగాను అభిమానులను సొంతం చేసుకున్నారు .ఇర్ఫాన్ ఖాన్ ను బలిగొన్న అరుదైన న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.ఎప్పుడూ విన్నట్టుగా లేదు కదా.. చర్మకణజాలల్లో విస్తరించి అంతర్గతంగా శరీర భాగాలకు సోకే అరుదైన క్యాన్సర్ ఎండోక్రైన్ క్యాన్సర్..దీనికి సంబంధించి కేసులు తక్కువే, అధ్యయనం తక్కువే.

Video Advertisement

న్యూరోఎండోక్రిన్ కణితులు (NET’s) శరీరంలో ఎక్కడైనా ఏ భాగానికైనా విస్తరించవచ్చు.ముఖ్యంగా ఊపిరితిత్తులు, క్లోమం, పేగులు మరియు పురీషనాళంలో ఈ కణుతులు ఎక్కువగా కనిపించవచ్చు. ఈ కణితులను శరీరంలో ఏ భాగంలో ఉన్నాయో వాటి వర్గీకరణ ఆధారంగా గుర్తించవచ్చు. వీటిల్లో కొన్ని రకాల క్యాన్సర్స్ శరీరంలోని హార్మోనల్ ఇంబాలెన్స్ కి కారణమవుతాయి..కొన్నిసార్లు ఇవి శరీరంలో ఉన్నప్పటికి ఎటువంటి లక్షణాలు కనపడవు, అలాంటి సమయంలో వీటిని గుర్తించడం కష్టమవుతోంది..చాలా వరకు న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ కణితులను గుర్తించలేకపోవడానికి కారణం ఇదే.. ఏదైనా పొరపాటున లేదంటే ఇతరత్రా అనారోగ్య లక్షణాల రీత్యా వీటిని ముందుగా గుర్తిస్తే తప్ప, లేదంటే చివరి స్టేజ్ వరకు వీటిని గుర్తించడం కష్టం..అందుకే దీనిలో మరణాలు ఎక్కువే.

వారసత్వపరంగా న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది..60 ఏళ్లు పైబడిన వారిలో NET లు ఎక్కువగా కనిపిస్తాయి. జీర్ణశయాంతర ప్రేగులను ప్రభావితం చేసే వ్యాధులు ఉన్నవారికి ఈ క్యాన్సర్ నుండి ఎక్కువ ప్రమాదం ఉంది.డయేరియా, చర్మంపై దద్దుర్లు, అలసట మరియు హై బిపి ఇతరత్రా లక్షణాలు ఎక్కువగా ఈ క్యాన్సర్ ఉన్నవారిలో కనిపిస్తుంటాయి..ఈ లక్షణాలు ఉన్నవారు  డాక్టర్ని సంప్రదించి బయాప్సి చేయించుకుంటే ఎటువంటి ట్యూమర్ లక్షణాలు కనపడిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రమాదం బారినుండి బయటపడవచ్చు..

RIP irrfan khan last video

RIP Irrfan Khan – Source : Cultnuts

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బాధపడుతున్నది, మరణాల సంఖ్య నమోదవుతున్నది క్యాన్సర్ కారణంగానే.. చర్మ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ , బ్లడ్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లతో మరణాలు సంభవిస్తున్నాయి.నిజానికి ప్రతి ఒక్కరి శరీరంలో క్యాన్సర్ కణాలు అనేవి ఉంటాయి. వాటితో ఫైట్ చేసే కణాలు కూడా మన శరీరంలోనే ఉండడం మూలంగా ఎప్పటికప్పుడు వాటి నుండి మనకి ముప్పు తప్పుతూ  ఉంటుంది..కొన్ని సంధర్బాల్లోనే ఇవి ప్రమాదకరమైన కణితులుగా మారతాయి…ఈ క్యాన్సర్ అనేది మొదట్లో గుర్తిస్తే చికిత్సతో నయం అవుతుంది. కాని చాలా కేసులలో దీన్ని ఫస్ట్ స్టేజ్లోనే గుర్తించలేకపోవడం వలన మరణాల శాతం ఎక్కువవుతున్నది.

సోనాలిబింద్రేకి క్యాన్సర్ అనే వార్త రాగానే ఎక్కువ మంది శరీరానికి సంబంధించిన పూర్తిస్థాయి చెకప్స్, టెస్ట్ చేయించుకున్నారనేది నిజం..నిజానికి ముఫ్పై ఏళ్ల పై బడిన వారు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి శుభ్రత పాటించడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం,ఆల్కహాల్,సిగరెట్ వాటికి దూరంగా ఉండడంలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.  ఆరోగ్యమే మహాభాగ్యం.


End of Article

You may also like