సినీ ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. అద్భుతమైన కామెడీ తో అందరినీ అలరిస్తాడు. అలానే అల్లరి నరేష్ కామెడీ మాత్రమే కాకుండా సీరియస్ యాంగిల్ లో కూడా నటించగలనని ఇదే సంవత్సరంలో నాంది సినిమాతో హిట్ ని కొట్టేసాడు.

Video Advertisement

అయితే ఇప్పుడు మంచి రేసులో దూసుకుపోతున్న ఈ నటుడికి అప్పట్లో లవ్ బ్రేకప్ అయిన విషయం చాలా మందికి తెలియదు. కొన్నేళ్ళక్రితం అల్లరి నరేష్ గురించి నెట్టింట్లో తెగ చర్చ జరిగింది. ప్రముఖ టీవీ న్యూస్ రీడర్ తో అల్లరి నరేష్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని ఆమెని వివాహం చేసుకుంటాడు అని జోరుగా ప్రచారం కూడా సాగింది. అయితే ఈ విషయంపై మీడియా ఆయనని ప్రశ్నించగా ఆయన షాకింగ్ రిప్లై ఇచ్చారు.

తనకి కాబోయే భార్య సాక్షి న్యూస్ రీడర్ లాగ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనితో వచ్చిన వార్త నిజం అన్నట్లు తేలింది. పైగా ఇలా కోరుకోవడంలో తప్పు లేదు కదా అని అన్నాడు నరేష్. అయితే న్యూస్ రీడర్ తో ఈయన ప్రేమ విఫలం అయింది. తర్వాత ఆయన తండ్రి చనిపోయాక విరూపని వివాహం చేసుకున్నాడు నరేష్.