మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమాని చేస్తున్నారు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు ఈ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలై పోయింది. ఇప్పటి వరకు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి ఇది మూడవ సినిమా. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే ఈ సినిమా లో నటిస్తోంది.

Video Advertisement

హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని తీసుకు రానున్నారు. రెండో హీరోయిన్ కింద శ్రీ లీల నటిస్తున్నట్లు టాక్.

అయితే ఈ సినిమా లో అల్లు అర్హ కూడా నటిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే దీని గురించి ఇప్పటి దాకా అధికారిక అప్ డేట్ రాలేదు. మరి నిజం గానే అర్హ ఇందులో నటిస్తోందా..? బన్నీ ఫ్యామిలీ ఆమె నటించేందుకు ఒప్పుకుంటుందా అనేది చూడాల్సి వుంది. ఇది ఇలా ఉంటే సమంత శాకుంతలం సినిమా లో కూడా అర్హ నటించింది. మహేష్ బాబు సినిమా లో కూడా ఈ చిన్నారి నటిస్తే బాగుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు.

గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ, రవి రిసెప్షన్ అయ్యింది. అయితే ఆ వేడుక లో మహేష్ బాబు అర్హతో మాట్లాడి అందరినీ అవాక్ అయ్యేలా చేశారు. మహేష్ అర్హ తో ఎంతో చక్కగా మాట్లాడారట. అలానే ఆమె ఎలా ఉందని ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నారు మహేష్. ఇక మహేష్ త్రివిక్రమ్ సినిమా విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్నా సీన్స్ ని వెరైటీ గా షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్లాష్‌ బ్యాక్‌ లో వచ్చే మహేష్ బాబు సన్నివేశాలే ఈ సినిమా కి హైలెట్ అని తెలుస్తోంది. ఇక మరి ఈ సినిమా ఎలా ఆడియన్స్ ని అలరిస్తుంది..? అభిమానులని ఇది ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాల్సి వుంది.