అల్లు అర్జున్ కూతురుగా నటిస్తున్న అల్లు అర్హ… ఏ సినిమాలో అంటే….!

అల్లు అర్జున్ కూతురుగా నటిస్తున్న అల్లు అర్హ… ఏ సినిమాలో అంటే….!

by Mounika Singaluri

అల్లు అర్జున్ కు తన కూతురు అర్హ అంటే పంచప్రాణాలు తన కూతురితో కలిసి ఉన్న చిన్న చిన్న క్యూట్ క్యూట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ కి అర్హ నిజంగా సొంత కూతురు కదా…! మళ్ళీ కూతురుగా నటించడం ఏంటి అని అనుకుంటున్నారా…!

Video Advertisement

 

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15 విడుదల కానుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక సర్ప్రైజ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్కి రష్మిక కి పెళ్లయిన తర్వాత ఒక కూతురు పుట్టే సీన్ ఉంటుంది అంట. ఆ సీన్ లో కూతురుగా అల్లు అర్హ నటిస్తుందని మూవీ టీం నుంచి రహస్య సమాచారం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంత పకడ్బందీగా దాచిన కూడా బయటకు వచ్చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఓకే సినిమాలో తండ్రి కూతుర్లని చూడడం కోసం ఎదురుచూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడంతో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


You may also like

Leave a Comment