Ads
నందమూరి నటసింహం బాలకృష్ణ, కమర్షియల్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ కాంబినేషన్ లో, ఎన్బీకే 107 వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఈవెంట్ కు చారిత్రక కట్టడమైన కర్నూలు కొండారెడ్డి బురుజును ఎంపిక చేసి దీపావళి కానుకగా టైటిల్ విడుదల చేసారు. ఈ చిత్రానికి ‘ వీర సింహ రెడ్డి’ అనే టైటిల్ పెట్టారు.
Video Advertisement
ఇద్దరి నుంచి రెండు సూపర్ హిట్స్ వచ్చిన తర్వాత వీరి కాంబో పై అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటికే విడుదైన పోస్టర్లు, టీజర్, ఈ సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి. టీజర్ లో పక్కా మాస్ లుక్ తో కనిపించిన బాలయ్య, పవర్ ఫుల్ డైలాగ్స్ తో రెచ్చిపోవడంతో, బొమ్మ బ్లాక్ బస్టర్ అని నందమూరి అభిమానులు ఫిక్స్ అయ్యారు.
అంతకు ముందే ఎన్బీకే 107 టైటిల్ ను అనౌన్స్ చేయనున్నట్లు, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. అయితే టైటిల్ లాంచ్ డేట్ ప్రకటన , మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు తలపోటుగా మారింది.
దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప 2 నిర్మాతలు మైత్రీ వారే అనే విషయం తెలిసిందే. సుకుమార్, బన్నీ కాంబోలో తెరకెక్కిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో, సెకండ్ పార్ట్ పై బన్నీ ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి, చాలా కాలమే అయినా, పుష్ప2 గురించి మాత్రం ఇప్పటి వరకు, మైత్రి వారి నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో సోషల్ మీడియాలో మైత్రీ మూవీ మేకర్స్ ని, బన్నీ ఫ్యాన్స్ బూతులతో ఏకిపారేస్తున్నారు.
End of Article